నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తాం

ABN , First Publish Date - 2022-10-05T05:49:44+05:30 IST

రేషన్‌ దుకాణాల ద్వా రా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందేలా చర్య లు తీసుకుంటామని సీఎ్‌సడీటీ వెంకటరెడ్డి తెలి పారు.

నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తాం
రేషన్‌ దుకాణంలో బియ్యాన్ని పరిశీలిస్తున్న సీఎ్‌సడీటీ వెంకటరెడ్డి

 సీఎ్‌సడీటీ వెంకటరెడ్డి ఫ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


గుర్రంకొండ, అక్టోబరు 4: రేషన్‌ దుకాణాల ద్వా రా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందేలా చర్య లు తీసుకుంటామని సీఎ్‌సడీటీ వెంకటరెడ్డి తెలి పారు. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ‘రేషన్‌ బియ్యంలో పురుగులు’ అన్న శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్‌డీటీ వెంకటరెడ్డి గుర్రంకొండలో రేషన్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రేషన్‌ దుకాణం-1లో బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పంపి ణీ చేసే బియ్యం నాణ్యమైనవిగా ఉండేలా డీలర్లు చూసుకోవాలన్నారు. పురుగులు, గూళ్లు కట్టిన బియ్యం ఉంటే గోడౌన్‌కు తిరిగి పంపాలన్నారు. అంతేకానీ తమ వద్ద ఉన్న తినడానికి వీలుకానీ బియ్యాన్ని పంపిణీ చేయవద్దని వారికి తెలిపారు. అనంతరం జీవన్‌కుమార్‌ అనే వ్యక్తికి ఇచ్చిన పురుగులు, గూళ్లు కట్టిన బియ్యాన్ని పరిశీలించారు. బాధితుడికి తిరిగి నాణ్యమైన బియ్యాన్ని ఇప్పించారు. ఎండీయూ ఆపరేటర్లు కూడా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలని ఆదేశించారు.


Updated Date - 2022-10-05T05:49:44+05:30 IST