పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం...

ABN , First Publish Date - 2022-09-25T05:41:52+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ, కుప్పంలో పులివెందుల తరహా అభివృద్ధి చేస్తామన్న జగన్‌ను ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని మాజీ మంత్రి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జైలు నుంచి కుప్పం టీడీపీ నాయకులు విడుదలై కుప్పం వెళ్తూ పలమనేరులో మార్కెట్‌ కమిటీ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం...
పలమనేరులో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి

పలమనేరు, సెప్టెంబరు 24: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ, కుప్పంలో పులివెందుల తరహా అభివృద్ధి చేస్తామన్న జగన్‌ను ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని మాజీ మంత్రి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జైలు నుంచి కుప్పం టీడీపీ నాయకులు విడుదలై కుప్పం వెళ్తూ పలమనేరులో మార్కెట్‌ కమిటీ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా  అమర్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏ శాఖ పనిచే యడం లేదని అయితే హోంశాఖను ముఖ్యమంత్రి బాగా పనిచేయిస్తూ టీడీపీనాయకులు, కార్యకర్తలపై పోలీసులతో తప్పుడు కేసులు నమోదు చేయిస్తు న్నారని విమర్శించారు. పులివెందులలో జగన్‌ను ఓడించడంతో పాటు అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులతోనే చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి చేశారో వివరిస్తామన్నారు. అలాగే పులివెందులలో చంద్రబాబు నాయకత్వంలో  మినిమహానాడు  ఏర్పా టు చేయిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీని వాసులు మాట్లాడుతూ... తనపై అమాయక టీడీపీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టిజైలుకు పం పారని వీటికి భయపడేది లేదని పేర్కొన్నారు. రాను న్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీకి ఓట్లు వేయాలని, అప్పుడే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు,  జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చిట్టిబాబు, పలమనేరు టీడీపీ నాయకులు ఆర్బీసీ కుట్టి, ఖాజా, బ్రహ్మయ్య, సుబ్రమణ్యం గౌడు, శ్రీధర్‌, మదన్‌మో హన్‌, నాగరాజరెడ్డి, గణేష్‌, సోమశేఖర్‌ గౌడు, ప్రతాప్‌, ఆనంద్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


అధికారంలోకి రాగానే వడ్డీ సహా...


వి.కోట: తమ నేతలు, కార్యకర్తలు అధికార నేతల వలే అవినీతి, అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లలేదని, ప్రజల పక్షాన నిలిచి జైలు కెళ్లినందుకు గర్వప డుతున్నామని మాజీ మంత్రి అమర్‌ అన్నారు. శని వారం వి.కోటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సహా ఇతర టీడీపీ నేతలకు వి.కోటలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నెర్నపల్లె, ఎన్టీఆర్‌ కూడలి నుంచి లాంగ్‌ బజారు మీదుగా  వాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేపి నివాళి అర్పించిన అనంతరం ప్రభు త్వ తీరుపై నేతలు నిప్పులు చెరిగారు. తప్పుడు కేసులతో టీడీపీ శ్రేణులను భయపెట్టలేరని హెచ్చ రికలు జారీ చేశారు. సీఎంగా జగన్‌ గద్దెనెక్కిన నాటి నుంచి ప్రభుత్వ తీరును ప్రశ్నించే గొంతులను తొక్కెయ్యడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండి పడ్డా రు. ఇటీవల కుప్పం చంద్రబాబు పర్యటన సందర్భం గా అన్న క్యాంటీన్‌ను వైసీపీ వారే ధ్వంసం చేసి తిరిగి టీడీపీ వారిపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. అలాగే కొల్లుపల్లెలో  విధ్వంస ఘటనలపై అక్రమంగా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో పాటు మరికొంత మందిపై కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సరిగాలేదని.. కాలం ఎప్పుడూ వాళ్ల పక్షానే ఉండదని తిరిగి తాము అధికారంలోకి వస్తే వడ్డీతో తిరిగి చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పులివర్తి నాని, ఏఎంసీ మాజీ  చైర్మన్‌ రామచంద్రనాయుడు, వి.కోట మండల టీడీపీ అధ్యక్షుడు రంగనాథ్‌, కార్యదర్శి సోము, రాజ్‌కుమార్‌, మునస్వామి, చౌడప్ప, రాం బాబు, చంద్రారెడ్డి, ధీరజ్‌, శబరీస్‌, రవి, సతీస్‌, విశ్వనాథ్‌, రాము, నారాయణస్వామి, నాగరాజ్‌, బాబు ఐటీడీపీ సభ్యులు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.


ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరు


రామకుప్పం/ శాంతిపురం: చిత్తూరు జైలు నుంచి విడుదలై కుప్పంకు ర్యాలీగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారిశ్రీనివాసులు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజ్‌కుమార్‌, నేతలు మంజునాథ్‌,  సుబ్రహ్మణ్యం, ముకేశ్‌కుమార్‌, మునెప్పకు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె, శాంతిపురంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గౌనివారి నాయకత్వం వర్థిల్లాలి... అంటూ నినాదాలు చేశారు. మహిళలు గౌనివారి తదితరులకు మంగహారతులు ఇచ్చారు.  గౌనివారి తదితరులు స్థానిక సీతారాముల ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమరనాథరెడ్డి, గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తినాని, కుప్పం ఇన్‌చార్జి మునిరత్నం మాట్లాడుతూ... విపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం అధికారపార్టీ అరాచకాలకు పరాకాష్టగా అభివర్ణించారు. కుప్పం నియోజకవర్గంలో  అక్రమకేసులు, వేధింపులతో తమ శ్రేణుల ఆత్మస్థ యిర్యాన్ని దెబ్బతీయలేరని వారు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా చంద్ర బాబు... నేతలు పార్టీ శ్రేణులు సంయమనం పాటించేలా  కట్టడి చేశారే తప్ప, ఏ ఒక్కరిపైనా దురుసుగా ప్రవర్తించలేదన్నారు. కేసులు పెట్టి జైలుకు పంపితే టీడీపీ శ్రేణులు భయపడతాయని వైసీపీ పెద్దలు భావిస్తున్నారన్నారు.  అధికారపార్టీ  పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుప్పంలో టీడీపీని ఏమీ చేయలేరన్నారు. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్ర బాబు అత్యఽధిక మెజారీటీతో గెలవడం తథ్యమన్నారు. వైసీపీ అధినేతకు దిమ్మతిరిగేలా కుప్పంలో చంద్ర బాబుకు అత్యధిక మెజారిటీ తీసుకువస్తామ న్నారు. ఆనందరెడ్డి, విశ్వనాథనాయుడు, నరసింహులు, నాగ రాజు, ఆంజనేయరెడ్డి, విజయరామిరెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-09-25T05:41:52+05:30 IST