అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని నిర్మిస్తాం

ABN , First Publish Date - 2022-05-27T06:07:54+05:30 IST

అత్యాధునిక సౌకర్యాలతో భీమ్‌గల్‌లో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని నిర్మిస్తాం
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

వారంలోగా భవన నిర్మాణానికి భూమిపూజ

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి  

వేల్పూర్‌లో దళితబంధు యూనిట్ల పంపిణీ


భీమ్‌గల్‌, మే26: అత్యాధునిక సౌకర్యాలతో భీమ్‌గల్‌లో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పేదలకు ఆరోగ్యాన్ని అందు బాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, భీమ్‌ గల్‌కు వంద పడకల ఆసుపత్రి మంజూరు ఇచ్చారని అన్నారు. భీమ్‌గల్‌కు వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి గురువారం మంత్రి క్షీరాభిషేకం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వంద పడకల ఆ సుపత్రి తన హయాంలో భీమ్‌గల్‌కు మంజూరు కావడం సం తోషంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజల పక్షాన తను సీఎం కు రుణపడి ఉంటానని, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆసు పత్రి మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుకు, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మంత్రి హరీష్‌రావుతో కలిసి భూమిపూజ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కన్నెప్రేమలత సురేందర్‌, మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు దొన్కంటి నర్సయ్య, మల్లెల లక్ష్మణ్‌; జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ మెంబర్‌ మోహీజ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ భగత్‌, జిల్లా సమ న్వయ కమిటీ సభ్యుడు కన్నె సురేందర్‌, కౌన్సిలర్‌లు, పట్టణ, మండల టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

దళిత బంధుతో స్వయం సమృద్ధి సాధించాలి 

వేల్పూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులు స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌ మార్కెట్‌యార్డు ఆవరణలో గురువారం బాల్కొండ నియోజకవర్గ పరిధిలో దళిత బంధు పథకం కింద తొలివిడతలో ఎంపికైన లబ్ధిదారులకు మంత్రి యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దశబ్దాలుగా దళితులను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారే తప్ప వారికి లబ్ధిచేకూర్చే పథకాలను గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టలేదన్నారు. దళిత కుటుంబాల స్థితిగతుల్లో మార్పులు తేవాలనే సద్దుద్దేశంతో సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దేశంలోనే ఇలాంటి పథకం ఎక్కడ లేదన్నారు. లబ్ధిదారులు దళిత బంధు పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలన్నారు. ఈ పథకం దళితులకే కాకుండా ఇతర వర్గాల వారిని సైతం ఇదే తరహలో చేయూతనిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేష్‌రెడ్డి, ఇన్‌చార్జి ఆర్డీవో రాజేశ్వర్‌, డీసీవో సింహాచలం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌, రైతులు పాల్గొన్నారు. 

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

నిరుద్యోగ యువత శిక్షణ శిబిరాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని మం త్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌ మం డలం పడిగెలలో బాల్కొండ నియో జకవర్గ ఉద్యోగ శిక్షణార్థులకు గురు వారం ఉచిత స్టడీ మెటీరియల్‌ను కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. సమయాన్ని వృథా చేయకుండా చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఇన్‌ చార్జి ఆర్డీవో రాజేశ్వర్‌, ఏపీసీ ప్రభాకర్‌రావు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌రెడ్డి, ఎం పీపీ భీమజమున రాజేం దర్‌, జడ్పీటీసీ అల్లకొం డ భారతి రాకేష్‌ చం ద్ర, టీఆర్‌ఎస్‌ మం డలాధ్యక్షుడు జైడి నాగాధర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T06:07:54+05:30 IST