Abn logo
Oct 25 2021 @ 23:24PM

బలిజలకు అండగా ఉంటాం...

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అవినా్‌షరెడ్డి

పోరుమామిళ్ల, అక్టోబరు 25 : బలిజలకు అండగా ఉంటామని ఎంపీ అవినా్‌షరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర థియేటర్‌ పక్కన ఉన్న షాపింగ్‌ మాల్‌లో బలజ కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, బలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ అడప శేషు, ఎన్‌ఆర్‌ఐ రత్నాకర్‌, అడా చైర్మన్‌ గురుమోహన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన అవినా్‌షరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బలిజల అభివృద్ధికి ఎప్పుడూ వెన్నంటి వుంటామని, ఈ ఉప ఎన్నికల్లో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.