రైతులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST

రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

రైతులకు అండగా ఉంటాం
భూంపల్లిలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి

  రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్‌


మిరుదొడ్డి, మే 27: రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి మండలం భూంపల్లి, ఖాజీపూర్‌ గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి బీజేపీ, టీఆర్‌ఎస్‌ గద్దెనెక్కాయని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రె్‌సపార్టీ అధికాంలోకి వస్తే వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. అధికారంలోకి రావడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. అనంతరం ఖాజీపూర్‌ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట నాయకులు భూమాగౌడ్‌,  శ్రీధర్‌, బాలాగౌడ్‌, రాజేశం, సుదర్శన్‌, కుమార్‌, వెంకటస్వామి, నరేందర్‌రెరెడ్డి, సురేష్‌, వెంకటయ్య, అంజాగౌడ్‌ తదితరులు ఉన్నారు.


ప్రభుత్వ చేతగానితనంతోనే ఇబ్బందులు: కొమ్మూరి


చేర్యాల, మే 27: ప్రభుత్వ చేతగానితనంతోనే ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు. కొమురవెల్లి, గౌరాయపల్లి, మర్రిముచ్ఛాల, లెనిన్‌నగర్‌, వేచరేణి, కిష్టంపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకుని వరంగల్‌ డిక్లరేషన్‌ కరపత్రాలను పంపిణీచేశారు. అకాలవర్షాలతో ధాన్యం తడిసి రైతాంగం విలపిస్తుంటే సీఎం కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటన చేయడం సిగ్గుచేటన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌తో రైతాంగానికి సమగ్రన్యాయం చేకూరుతుందని, కాంగ్రె్‌సకు అండదండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు లింగంపల్లి కవిత, కొయ్యడ రాజమణి, నాయకులు కొమ్ము నర్సింగరావు, అంజిరెడ్డి, వంగ కృష్ణారెడ్డి, పుల్లం భిక్షపతి, సత్యం, కాటం మల్లేశం, బుట్టి యాదగిరి, ఉడుముల భాస్కర్‌రెడ్డి, నల్లగోని బాలకిషన్‌, మోహన్‌రెడ్డి, దాసరి క్రాంతి, అర్షద్‌, వెంకట్‌రెడ్డి, లింగంపల్లి సుధాకర్‌, జొర్రీగల శ్రీనివా్‌సరెడ్డి, వీరబ్రహ్మం, కొయ్యడ బాబు, సాంబశివులు, షాదుల్లా తదిత రులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST