అందర్నీ సురక్షితంగా కాపాడిన తర్వాతే.. నష్టంపై ఆలోచిస్తాం : సీరం

ABN , First Publish Date - 2021-01-21T22:36:02+05:30 IST

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన తర్వాతే, ప్రమాదం వల్ల ఎంత మేర నష్టపోయామన్న

అందర్నీ సురక్షితంగా కాపాడిన తర్వాతే.. నష్టంపై ఆలోచిస్తాం : సీరం

పూణె : అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన తర్వాతే,  ప్రమాదం వల్ల ఎంత మేర నష్టపోయామన్న విషయంపై ఓ అంచనాకు వస్తామని సీరం ఇనిస్టిట్యూట్ చీఫ్ అధర్ పూనావాలా ప్రకటించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారందర్నీ సురక్షితంగా బయటికి తీయడమే తమ ప్రప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఒకరిద్దర్ని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతానికి మా ఏకైక ప్రాధాన్యత ఇదే. అగ్నిప్రమాదంతో ఎంత మేర నష్టపోయామన్నది ఆ తరువాతే ఓ అంచనాకు వస్తాం.’’ అని అధర్ పూనావాలా స్పష్టం చేశారు. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తికి వచ్చిన అంతరాయమేమీ లేదని సంస్థ విస్పష్టమైన ప్రకటన చేసింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్లాంట్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూణెలో నిర్మాణంలో ఉన్న భవనంలోని నాలుగు, ఐదు అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఘటనా స్థలానికి 10 అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలనార్పే ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2021-01-21T22:36:02+05:30 IST