వార్డుల వారిగా మండల స్థాయి అధికారులను నియమిస్తాం

ABN , First Publish Date - 2022-05-21T05:42:17+05:30 IST

పట్టణ ప్రగతిలో వార్డుల వారిగా మండల స్థాయి అధికారులను నియమిస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

వార్డుల వారిగా మండల స్థాయి అధికారులను నియమిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి టౌన్‌, మే 20: పట్టణ ప్రగతిలో వార్డుల వారిగా మండల స్థాయి అధికారులను నియమిస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతిపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యలను మండలస్థాయి అధికారులు ముందుగా గుర్తించాలని కోరారు. ప్రతీ వార్డులో ఒక పార్కును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. బృహత్‌ పట్టణ ప్రకృతి వనాలను కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించాలని కోరారు. ప్రతీ పట్టణంలో రెండు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడానికి స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వం 50 వేల రూపాయలతో స్పోర్ట్స్‌కిట్‌ను అందజేస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి ద్వారా వార్డులో పాదయాత్ర చేపట్టి ప్రధాన సమస్యలను గుర్తించి దశలవారిగా పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. వార్డుల వారిగా యూత్‌, మహిళ, సీనియర్‌ సిటిజన్‌ కమిటీలను ఏర్పాటుచేసి వార్డు సభకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పట్టణాలు సమీకృత మార్కెట్ల నిర్మాణం పనులను సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలని కోరారు. వైకుంఠ ధామాలు వాడుకలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగించి హరితహారంలో మొక్కలను పెంచాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, మున్సిపల్‌ చైర్మన్‌లు గంగాధర్‌, సత్యనారాయణ, కమిషనర్‌లు రమేష్‌, దేవేందర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించాలి

ఎల్లారెడ్డి రూరల్‌, మే 20: పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌తో మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ చర్చించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఎల్లారెడ్డి పట్టణానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు, ప్రభుత్వకార్యాలయాల్లో వర్షాకాలం లీకేజీలను వివరించి పరిష్కరించాల్సిందిగా కోరా రు. ఎల్లారెడ్డిలోని 12 వార్డులు ఉండగా ఐదు వార్డులకు ఒక ప్రత్యేకాధికారి నియ మించి ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే పట్టణ ప్రగతిలో నిధులు వృథా కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని తెలిపారు.

Updated Date - 2022-05-21T05:42:17+05:30 IST