ప్రభుత ్వం దిగి వచ్చేదాకా ఉద్యమిస్తాం

ABN , First Publish Date - 2022-01-29T05:26:06+05:30 IST

ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఉద్యమిస్తామని పీఆర్సీ సాధన సమితి నేతలు హెచ్చరించారు. కలెక్టరేట్‌ ఎదుట పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు హాజరయ్యారు.

ప్రభుత ్వం దిగి వచ్చేదాకా ఉద్యమిస్తాం
కలెక్టరేట్‌ ఎదుట పీఆర్సీ సాధన సమితి చేపట్టిన దీక్షలో కూర్చును ఉద్యోగ, ఉపాధ్యాయులు

పీఆర్సీ సాధన సమితి హెచ్చరిక 

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 28: ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఉద్యమిస్తామని పీఆర్సీ సాధన సమితి నేతలు హెచ్చరించారు. కలెక్టరేట్‌ ఎదుట పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు హాజరయ్యారు. సుమారు వంద మందికి పైగా దీక్షలు చేపట్టారు. పీఆర్సీ సాధన సమితి నేత బి.శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఆర్సీ జీవోలను రద్దు చేసి పాత జీతాలు ఇచ్చిన తరువాతనే తిరిగి చర్చను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి మాట్లాడుతూ అశుతోష్‌ మిశ్రా నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. యూటీఎఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ మాట్లాడుతూ ఈనెల పాత జీతాలు ఇవ్వాలని, పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ ఎస్సార్‌ వెంకట జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ జీఓలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ఫోరం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి భాస్కర్‌రావు, ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు రామ్మూర్తి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకురాలు నీలవేణి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ ఇలియా్‌సబాషా, సీపీఎస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:26:06+05:30 IST