గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో వసతులు కల్పిస్తాం

ABN , First Publish Date - 2021-07-25T05:28:03+05:30 IST

పురపాలక సంఘం పరిధిలోని జగ్గుశాస్త్రులపేట వద్దగల ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో మౌలిక వసతులు కల్పిస్తామని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో ఎంవీ శివారెడ్డి తెలిపారు.

గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో వసతులు కల్పిస్తాం
స్టేడియాన్నిపరిశీలిస్తున్న సీఈవో

ఆమదాలవలస: పురపాలక సంఘం పరిధిలోని జగ్గుశాస్త్రులపేట వద్దగల ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో మౌలిక వసతులు కల్పిస్తామని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో ఎంవీ శివారెడ్డి తెలిపారు. ఆమదాలవలస స్టేడియం జిల్లా క్రికెట్‌ సంఘం లీజుకు తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్టేడి యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో క్రికెట్‌ ఆటకు కేంద్రంగా స్టేడియం రూపుదిద్దుకునేలా చర్యలు చేపడతామని చెప్పారు. మైదానం  నిర్మించేందు కు   ఏర్పాట్లుచేయాలని సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారికి ఆయన ఆదేశించారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాంను  కలిశారు. శివారెడ్డిని జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ సన్మానించారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి జేవీ భాస్కరరావు, సభ్యులు ఈశ్వరరావు, జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


  


Updated Date - 2021-07-25T05:28:03+05:30 IST