Abn logo
Apr 21 2021 @ 00:33AM

అర్ధంతర సెలవులతో తీవ్రంగా నష్టపోయాం


 ప్రైవేట్‌ స్కూళ్లు, టీచర్లను ఆదుకోవాలి   :  ప్రైవేట్‌ పాఠశాలల సంఘం

 అనంతపురం విద్య, ఏప్రిల్‌ 20: కరోనా పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రభు త్వ ం స్కూళ్లకు అర్ధంతరంగా సెలవులు ప్ర కటించడంతో ప్రె ౖవేట్‌ యాజమాన్యా లు తీవ్రంగా నష్టపోయాయని, స్కూళ్లు, ప్రైవేట్‌ టీచర్లను ఆదుకోవాలని జిల్లా ప్రైవేట్‌ పాఠశాలల సంఘం (ఏడీపీఎ్‌సఏ) నాయకులు కోరారు. మంగళవారం స్థా నిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం గత ఏడాది మాదిరే ఈఏడాది కూడా ఉన్నఫలంగా సెలవులు ఇచ్చిందన్నారు. ఇలా అత్యవసరంగా పాఠశాలలు మూసివేయడంతో యాజమాన్యాలు ఫీజులు రాక ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆ యా స్కూ ళ్లలో పనిచేసే టీచర్లు సైతం జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్‌ స్కూళ్ల టీచర్లకు భృతి ఇస్తోందని, మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు. ప్రశ్నపత్రాల కోసం డీసీఈబీకి యాజమాన్యాలు ఫీజులు చెల్లించాయని, పరీక్షలు జరగని నేపథ్యంలో వసూలు చేసిన ఫీజులు వెనక్కు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి రమణారెడ్డి, సీఆర్వో రవిచంద్రారెడ్డి, నగర గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కోశాధికారి వేణు మనోహర్‌, జానకీ రాములు, శ్రీవాస్తవ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement