పాట్నా: కుల గణనపై బిహార్ అసెంబ్లీ రెండు తీర్మానాలు ఆమోదించిందని అయితే కేంద్ర ప్రభుత్వంపై దీనిపై ఇంకా సముఖంగా లేకపోవడం బాధాకరమని బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ విషయమై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి జరిగే జనాభా లెక్కల్లో కుల గణన ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. శుక్రవారం బిహార్ రాజధాని పాట్నాలో ఓ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, కుల గణనపై సుప్రీంకోర్టు ముందు మహారాష్ట్ర ఒక అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని తేజస్వీ గుర్తు చేస్తూ ‘‘న్యూస్ పేపర్లో చూశాను. మహారాష్ట్ర ఇదే అంశంపై సుప్రీంలో అవిడవిట్ దాఖలు చేస్తే కులం ఆధారంగా గణన జరగదని సుప్రీం తేల్చి చెప్పటినట్లు చదివాను’’ అని తేజస్వీ అన్నారు. కుల గణన జరగాల్సిందేనని, లేదంటే సమాజిక న్యాయం చేయడం సాధ్యం కాదని తేజస్వీ అన్నారు.