Abn logo
Sep 21 2021 @ 23:26PM

అక్బర్‌ బాషా కుటుంబానికి అండగా ఉంటాం

బాధితుడిని పరామర్శిస్తున్న పీఎండీ నజీర్‌

 కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎండీ నజీర్‌ 

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబరు 21: తన భూమిని కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం చేసిన దువ్వూరు మండలానికి చెందిన అక్బర్‌ బాషా కుటుంబానికి పార్టీలకతీతంగా అండగా ఉంటామని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎండీ నజీర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న అక్బర్‌బాషాను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. తనకు అన్యాయం జరిగిందని, తన కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని ముఖ్యమంత్రికి తెలియజేసినా కూడా ఎటువంటి న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. బాధితులకు న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం ఏలుతోందని, సామాన్య ప్రజలు బ్రతికేందుకు అవకాశాలు కనిపించడంలేదని ఇందుకు దువ్వూరు మండల అక్బర్‌ బాష సంఘటనే  నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సీఎం, రాష్ట్ర, జిల్లా అధికారులు స్పందించి అక్బర్‌ బాషాకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.