ముద్ర బాధితులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-01-25T06:02:01+05:30 IST

ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో నష్ట పోయిన బాధితులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పక్షాన పోరాడుతామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ముద్ర బాధితులకు అండగా ఉంటాం
వెల్గటూర్‌లో మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

- అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

వెల్గటూర్‌, జనవరి 24: ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో నష్ట పోయిన బాధితులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పక్షాన పోరాడుతామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మండలం లోని సుమారు 60 మంది ఖాతాదారులు ప్రజలను మభ్య పెట్టి కోట్లా ది రూపాయలు డిపాజిట్‌ చేయించుకొని చేతులు ఎత్తివేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇలాంటి సొసైటినీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బ్యాంక్‌ ను ప్రారంభించడం విశేషమన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ చూపి ము ద్ర బ్యాంక్‌ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశా రు. ముద్ర కో ఆపరేటివ్‌ సొసైటీ ఇంత పెద్ద దోపిడీకి పాల్పడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని? ప్రశ్నించారు. రెక్కల కష్టం మీద బతికే పేదవాళ్లను ముద్ర బ్యాంక్‌ వాళ్లు మోసం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ చూ స్తూ ఊరుకోదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మంత్రి ఈశ్వర్‌ డీజీపీ దృష్టికి విషయం తీసుకవెళ్లి ముద్ర బ్యాంక్‌ నిర్వాహకులను వెం టనే అరెస్ట్‌ చేయించి, వారి ఆస్తులు రికవరీ చేయించి బాధితులకు డ బ్బులు తిరిగి చెల్లించేలా చూడాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నన్నామని, జిల్లా లోని బాధితులు కలెక్టర్‌ కార్యాలయానికి రావాలని కోరారు. బాధి తులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శైలేంధర్‌ రెడ్డి, సర్పంచ్‌ మేరగు మురళి, ఉప సర్పంచ్‌ సందీప్‌రెడ్డి, నాయకులు తిరుపతి, నరేష్‌, ముద్ర బాధితులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T06:02:01+05:30 IST