వైసీపీకి చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-08-20T05:42:22+05:30 IST

వైసీపీ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ మండల అధ్య క్షుడు షేక్‌ షంషుద్దీన్‌ అన్నారు.

వైసీపీకి చరమగీతం పాడాలి
కొణికిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

కొల్లావారిపాలెం(పర్చూరు), ఆగస్టు 19: వైసీపీ పాలనకు చరమ గీతం పాడేందుకు  ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ మండల అధ్య క్షుడు షేక్‌ షంషుద్దీన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని కొల్లావారి పాలెం లో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నిత్యా వసర వస్తువులైన పెట్రోలు, డీజిల్‌, ఇసుక, ఆర్జీసీ, కరెంటు చార్జీలు విపరీతంగా పెంచి పేద ప్రజ లపై పెనుభారం మోపారని విమర్శించారు. వైసీపీ అరాచక పాలన పరాకాష్టకు చేరిందని, ప్రజలు బుద్ధిచెప్పే రోజు దగ్గరపడిందన్నారు. రాష్ట్రంలో ఏవర్గ ప్రజలు సంతోషంగా లేర న్నారు. సంక్షేమ పథకాల పేరుతో జగన్‌ పేదలకు వలవిసిరి నడ్డి విరగకొట్టారని పేర్కొన్నారు. రాష్ట్రం గాడిన పడాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావా లన్నారు. 

ఈ సందర్భంగా ఇంటింటికి తిరు గుతూ ప్రభుత్వం పెంచిన చార్జీలు ధరలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కొ ల్లా చంద్రం, మానం హరిబాబు, కొరిటాల సు రేష్‌, అడ్డగడ నాగేశ్వరరావు, శ్రీరాం వెంకట సుబ్బారావు, గోరంట్ల రామకృష్ణ, కొండ్రగంటి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


 ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం

ఇంకొల్లు, ఆగస్ట్టు19: వైసీపీ పాలనలో ప్రజల నడ్డివిరిచేలా నిత్యావసర ధరలు పెరిగాయని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు ధ్వజమెత్తారు.  మండలంలోని కొణికి గ్రామంలో శుక్రవారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర ధరలు పెరగి ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.  

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు వీరగంధం ఆంజనేయులు, గుంజి వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధానకార్యదర్శి రామకృష్ణ, పార్టీ గ్రామ అధ్యక్షుడు గుది సీతారామయ్య, మల్లికార్జున, గుత్తికొండ హనుమంతరావు, సుబ్బారావు, ఇండ్ల శ్రీనివాసరావు, దేవతోటి నాగరాజు, ఎలియాజర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T05:42:22+05:30 IST