Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

twitter-iconwatsapp-iconfb-icon
మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి తాండూరు : తిరంగా అభియాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన

  • ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు 
  • వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో ఉత్సాహంగా తిరంగా ర్యాలీ

మేడ్చల్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/వికారాబాద్‌/ఘట్‌కేసర్‌/ బంట్వారం (కోట్‌పల్లి)/ధారూరు/తాండూరు/తాండూరు రూరల్‌/ యాలాల/ పెద్దేముల్‌/కీసర రూరల్‌/శామీర్‌పేట/కొడంగల్‌/కొడంగల్‌ రూరల్‌/ బొంరా్‌సపేట్‌/ పూడూర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/ఘట్‌కేసర్‌/మేడ్చల్‌/పరిగి/బషీరాబాద్‌  ఆగస్టు 13 : దేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టిన మహనీయులను స్మరించుకుంటూ స్వాతంత్ర స్ఫూర్తిని ఎలుగెత్తి చాటాలని  మంత్రి మల్లారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం తిరంగా ర్యాలీ (ఫ్రీడమ్‌ రన్‌) నిర్వహించారు. కాగా, ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో జరిగిన ఫ్రీడమ్‌ ర్యాలీల్లో మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డిలు పాల్గొన్నారు. నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు వందలాధిగా పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయులు ప్రాణాలను లెక్క చేయకుండా శ్రమించారని గుర్తుచేశారు. ఘట్‌ కేసర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పావని జంగయ్య, పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్లు మాధవరెడ్డి, రెడ్డియానాయక్‌, నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, అంజిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  అదేవిధంగా ప్రతీ ఒక్కరు స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకుసాగాలని మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ అన్నారు. కీసర కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా అధికారులు, సిబ్బంది, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ఫ్రీడమ్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులు ప్రత్యేక ప్రదర్శనగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఫ్రీడమ్‌ ర్యాలీలో బెలూన్‌లు వదిలారు. విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌స, స్కౌట్స్‌ అండ్‌ గౌడ్స్‌తో నిర్వహించిన ప్రీడమ్‌ ర్యాలీలో వందేమాతరం, భారత్‌మాతాకీ జై, సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్‌ హమారా అనే నినాదాలతో మార్మోగింది. అదనపు కలెక్టర్లు జాన్‌శ్యాంసన్‌, లింగ్యానాయక్‌, జడ్పీ సీఈవో దేవసహాయం, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ బాలాజీ, డీఈవో విజయకుమారి, డీఎ్‌సవో బలరాం పాల్గొన్నారు. 

వికారాబాద్‌ ప్టణంలోని ఎంఆర్‌పీ చౌరస్తా నుంచి బ్లాక్‌గ్రౌండ్‌ వరకు నిర్వహించిన ప్రీడమ్‌ ర్యాలీని కలెక్టర్‌ నిఖిల జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ కోటిరెడ్డి, వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల రమే్‌షలతో పాటు జిల్లా అధికారులు, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. డీవైఎ్‌సవో హనుమంతరావు, డీటీడబ్ల్యూవో కోటాజీ, ఎస్సీ కార్పోరేషన్‌ అధికారి మల్లేశం, బీసీ వెల్ఫేర్‌ అధికారి సుధారాణి, డీబ్ల్యూవో లలితకుమారి, మునిసిపల్‌ కమిషనర్‌ శరత్‌ చంద్ర, తదితరులు పాల్గొన్నారు. కోట్‌పల్లి, బంట్వారం మండలాలు, వివిధ గ్రామల్లో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధులవెంట 75మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కోట్‌పల్లి, బంట్వారం పాఠశాలల్లో క్రీడాపోటీలు ప్రారంభించారు. కోట్‌పల్లి ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, స్థానిక సర్పంచ్‌ నక్కల విజయలక్ష్మి, ఎంపీటీసీ మహే్‌షగౌడ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు. ధారూరులో గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. సర్పంచ్‌ చంద్రమౌళి, ఎస్‌ఐ రాధిక, నాయకులు, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరన్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి కోరారు. తాండూరు మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, యువకులతో కరన్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్‌ ర్యాలీ చెంగోల్‌ నుంచి కరన్‌కోట్‌ పోలీసు స్టేషన్‌ వరకు కొనసాగింది. ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి(సాయిరెడ్డి), సర్పంచ్‌ రాజప్పగౌడ్‌, జగదీశ్వర్‌, తాండూరు నియోజక వర్గం మహిళా కన్వీనర్‌ శకుంతల పాల్గొన్నారు. తాండూరు మండలం మల్కాపూర్‌లో జడ్పీ ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌ విజయలక్ష్మి, తాండూరు మండల మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌హసన్‌పటేల్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు వైద్యనాథ్‌, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

యాలాల మండలంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా సమావేశమై వజ్రోత్సవాల నిర్వహణపై మాట్లాడుతూ పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం యాలాల మండల కేంద్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ సంధ్యారాణి, వైస్‌ ఎంపీపీ రమే్‌షకుమార్‌, తాండూరు సీఐ, యాలాల ఎస్‌ఐ, సర్పంచ్‌ సులోచన, ఎంఈవో సుధాకర్‌రెడ్డి, ఎంపీడీవో పుష్పలీల, కో-ఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌బాబా, బీజేపీ మండల అధ్యక్షుడు మైపాల్‌, తదితరులు పాల్గొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌లో పోలీసులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. తాండూరు పట్టణంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, సీఐ రాజేందర్‌రెడ్డి, నాయకులు రాజుగౌడ్‌, ప్రభాకర్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, నర్సింహులు, షుకూర్‌ తదితరులు పాల్గొని ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఇందారాచౌక్‌ నుంచి పట్టణ పుర వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది.

కాగా, తాండూరు పట్టణంలో తిరంగ అభియాన్‌ కమిటీ ఆధ్వర్యంలో భారీ జాతీయజెండాలను ప్రదర్శించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ సమక్షంలో పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఇందిరాచౌక్‌ వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడి జాతీయజెండాలు ప్రదర్శించారు.ఈ సందర్భంగా ప్రదర్శనను డ్రోన్‌ ద్వారా చిత్రీకరించారు. అలాగే స్వతంత్య్ర వేడుకల సందర్భంగా తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి కె. సుదర్శన్‌ తెలిపారు. శనివారం వికారాబాద్‌ జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో తీరంగా ర్యాలీని నిర్వహించారు. వికారాబాద్‌ కోర్టు నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు.. ఎమ్మార్సీ చౌరస్తాలు, పట్టణంలో ప్రధాన కూడళ్ల కలుపుకుని ర్యాలీ నిర్వహించారు. సీనియర్‌ న్యాయమూర్లు శంకర్‌, శ్రీదేవి, శ్రీకాంత్‌, పీపీలు రాజేశ్వర్‌, నమీనబేగం, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాధవరెడ్డి, ఉపాధ్యక్షుడు దుద్యాల లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి జగన్‌, సంయుక్త కార్యదర్శి మహావీర్‌ బందయ్య, స్పోర్ట్స్‌ సెక్రటరీ రాజశేఖర్‌, న్యాయవాదులు లవకుమార్‌, సంపూర్ణ ఆనంద్‌, బాలయ్య, శంకరయ్య, యాదయ్య, ఖయూమ్‌, ఆనంద్‌ బార్‌ అసోసియేషన్‌ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా వజ్రోత్సవాల్లో భాగంగా పరిగి పట్టణంలో ఫ్రీడమ్‌ రన్‌ చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ మీదుగా కొడంగల్‌ చౌరస్తా వరకు రన్‌ నిర్వహించారు. ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌లతోపాటు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈమేరకు ర్యాలీలను బీజేపీ, మైనారిటీల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్ళుగా పూర్తి చేసుకున్న సందర్భంగా 75 మీటర్ల జాతీయ జెండాను ఊరేగింపులో ప్రదర్శించారు. కీసర మండలంతో పాటు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో స్వాతంత్య్ర భారత్‌ వజ్రోజత్సవ వేడుకలు ఊపందుకున్నాయి. పలు పార్టీలు, పాఠశాలలు, వివిధ కాలనీల్లో ర్యాలీలు నిర్వహించారు.

మేడ్చల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కీసర మండల కేంద్రం నుంచి జవహర్‌నగర్‌ వరకు ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్ర నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌, మేడ్చల్‌ జడ్పీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌, టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, మేడ్చల్‌ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌ వజ్రే్‌షయాదవ్‌లు ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల సమర్పించి ర్యాలీని ప్రారంభించారు. మేడ్చల్‌ జల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గోగుల సరిత, మేడ్చల్‌ బీ-బ్లాక్‌ అధ్యక్షుడు వేముల మహే్‌షగౌడ్‌, ఏ-బ్లాక్‌ అధ్యక్షుడు పోచయ్య, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు, మున్సిపల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, యూత్‌కాంగ్రె్‌స నాయకులు, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే నాగారం మున్సిపాలిటీలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిభాపూలే గురుకుల పాఠశాలలో ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాళ్లు అంజన్న, పీఎన్‌ చారీలు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. నాగారం మున్సిపల్‌ కౌన్సిలర్‌ శ్రీనివా్‌సగౌడ్‌, పీఈటీలు కనకయ్య, మధులు, టీచర్లు పాల్గొన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రణీత ఆధ్వర్యంలో 13, 14, 15, 18 వార్డుల్లో ర్యాలీని ప్రారంభించారు. స్థానికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మిగతా వార్డుల్లో ఆయా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ స్వామి, వైస్‌చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాలు, తూంకుంట మున్సిపాలిటీలోని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో సర్పంచ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పట్టుకొని గ్రామంలోని ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఇండియా అనే పేరుతో ఆకట్టుకున్నారు. రైతు బంధు మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి, గ్రామపెద్దలు యువకులు పాల్గొన్నారు.

తూంకుంట మున్సిపాలిటీలో చైర్మన్‌ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కమిషనర్‌ జైత్‌రామ్‌, వైస్‌ చైర్మన్‌ వీరారెడ్డి, కౌన్సిలర్లు జెండాలను పట్టుకుని గామ్ర పెద్దలు, యువకులతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఘట్‌కేసర్‌ మండలంలోని పలు గ్రామాల్లో రాల్యీలు నిర్వహించారు. అవుషాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఎంపీడీవో అరుణారెడ్డి, సర్పంచ్‌ కావేరి, ఉపసర్పంచ్‌ అయిలయ్యయాదవ్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, కార్యదర్శులు ర్యాలీలలో పాల్గొన్నారు. ఎదులాబాద్‌లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అంబేద్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌లు సురేష్‌, వెంకటే్‌షగౌడ్‌, మంగమ్మ, గీత, గోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, యాదగిరి, జలజ, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, వజ్రోత్సవాల్లో భాగంగా హర్‌ ఘర్‌కు తిరంగా కార్యక్రమాన్ని పూడూరులో నిర్వహించారు. అయతే, పూడూరు పరిధి ఔటర్‌ రింగురోడ్డు పక్కనే నివాసముంటున్న హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సర్పంచ్‌ బాబూయాదవ్‌ జాతీయ జెండాను అందజేశారు. గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే శామీర్‌పేటలోని మేడ్చల్‌ బాయ్స్‌ మైనారిటీ గురుకుల పాఠశాల్లో ప్రిన్సిపాల్‌ విక్రమ్‌సేన్‌ ఆధ్వర్యంలో అధ్యాపకులు పెద్ద ఎత్తున స్వాతంత్య్ర వజ్రోత్సవ ర్యాలీని నిర్వహించారు. 

కొడంగల్‌ మండలం అన్నారం, హస్నాబాద్‌, పర్సాపూర్‌ తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు టి.అనితాపకీరప్ప, బి.పకీరప్ప, సయ్యద్‌ అంజద్‌ల ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను జరుపుకున్నారు. పాఠశాలల విద్యార్థులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలతో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి వజ్రోత్సవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బొంరా్‌సపేట్‌ మండల కేంద్రంలో అన్నీ శాఖల అధికారులు, పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రం నుంచి బొట్లవనితండా వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు హేమీబాయి, పాండునాయక్‌, సుదర్శన్‌రెడ్డి, తిరుపతయ్య, నారాయణ, ఆనంద్‌ తదితరులు పాఠశాలల విద్యార్థులతో వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు. పూడూర్‌ మండల  పరిధిలోని చీలాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ రాములు ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్థులు రామస్వామి, యువకులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, కొడంగల్‌ మండలంలో అధికారులు ప్రజాప్రతినిధులు వజ్రోత్సవ ర్యాలీలు నిర్వహిస్తుంటే.. మరో పక్క వ్యవసాయ కూలీలు పొలాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూలీలు నాట్లు వేయడానికి పొలాల బాట పట్టారు. అలాగే వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కులకచర్ల ఎస్‌ఐ గిరి తెలిపారు. కులకచర్లలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. జీపీ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

  •  దేశభక్తి చాటిన వానరం.. జాతీయజెండాకు వందనం

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ ఓ వానరం సైతం తన దేశభక్తిని చాటింది.  ఈ అపురూప దృశ్యం వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఆవిష్కృతమైంది. పరిగి పట్టణంలోని మాజీ జడ్పీటీసీ ఎస్‌పి బాబయ్య ఇంటిపై ఏర్పాటుచేసిన జాతీయజెండాకు శనివారం సాయంత్రం ఓ కోతి వందనం(సెల్యూట్‌) చేసింది. దీంతో ఆ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. జాతీయ జెండాను పట్టుకుని సలాం చేసిన కోతి దేశభక్తిని ఈసందర్భంగా వారు మెచ్చుకున్నారు. బషీరాబాద్‌ మండలం కుప్పన్‌కోట్‌తండాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తండాలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్‌ పద్మ చందర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.