‘బీజేపీ అలాంటి పార్టీ అని శివసేన అప్పుడే గుర్తించింది’

ABN , First Publish Date - 2021-12-12T03:11:38+05:30 IST

ప్రశ్నలను లేవనెత్తే వారిని తమ కండబలంతో అణచివేస్తున్నారు. కొన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకోవాల్సి ఉంది. అందుకు ‘నేంకేచి బోలానె’ పుస్తకం చదవాలి. ఆయనకు ఈ పుస్తకాన్ని నేనే బహుమతిగా ఇస్తాను..

‘బీజేపీ అలాంటి పార్టీ అని శివసేన అప్పుడే గుర్తించింది’

ముంబై: భారతీయ జనతా పార్టీది విభజనవాదమని శివసేన పార్టీ రెండేళ్ల క్రితం గ్రహించిందని, వాస్తవానికి ఈ విషయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ 25 ఏళ్ల క్రితమే చెప్పారని శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. శినివారం రాజకీయ ర్యాలీల్లో శరద్ పవార్ చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన ‘నేంకేచి బోలానె’ అనే మరాఠీ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘25 ఏళ్ల క్రితమే భారతీయ జనతా పార్టీ విధానం విభజనవాదమని శరద్ పవార్ చెప్పారు. కానీ ఆ విషయాన్ని మేము రెండేళ్ల క్రితం గ్రహించాము. బీజేపీ తిరోగమన విధానాలు దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. వాస్తవానికి ఇది మేము చాలా కాలం క్రితమే గ్రహించి ఉండాలి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ‘నేంకేచి బోలానె’ పుస్తకం చాలా అద్భుతంగా ఉందని, ఈ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహుమతి ఇస్తానని అన్నారు. అవసరమైతే ఆయనకు అర్థమయ్యేలా అనువాదం చేసి చెప్తానని రౌత్ అన్నారు.


‘‘ప్రశ్నలను లేవనెత్తే వారిని తమ కండబలంతో అణచివేస్తున్నారు. కొన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకోవాల్సి ఉంది. అందుకు ‘నేంకేచి బోలానె’ పుస్తకం చదవాలి. ఆయనకు ఈ పుస్తకాన్ని నేనే బహుమతిగా ఇస్తాను’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

Updated Date - 2021-12-12T03:11:38+05:30 IST