ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తాం

ABN , First Publish Date - 2021-02-24T04:38:51+05:30 IST

ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తామని జిల్లా కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ ఉదయభాను తెలిపారు.

ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తాం
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఉదయభాను తదితరులు

రైల్వేకోడూరు, ఫిబ్రవరి, 23: ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తామని జిల్లా కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ  సంస్థ డైరెక్టర్‌ ఉదయభాను తెలిపారు. మంగళవారం రైల్వేకోడూరు పట్టణంలోని గిరిజా లేన్‌లో గ్లోబుల్‌ సర్వీస్‌ ట్రస్టు శిక్షణ కేంద్రంలో ఉచిత ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా శిక్షణ కేంద్రంలో టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, జ్యూట్‌ బ్యాగ్‌ తయారీ తదితర అంశాలపై ఉచితంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. బుధవారం నుంచి 13 రోజుల పాటు కడపలో ఉచిత వసతితో పాటు జ్యూట్‌ బ్యాగ్స్‌పై శిక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబుల్‌ సర్వీస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ కె. పార్థసారధి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-24T04:38:51+05:30 IST