వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-06-05T11:04:54+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకోవాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలి

కార్మిక సంఘాల డిమాండ్‌ 

గ్రామ సచివాలయాల ఎదుట ధర్నా


లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకోవాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో సచివాలయాల ఎదుట గురువారం ధర్నా చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందించారు.


ఆదోని, జూన్‌ 4: వ్యవసాయ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉచ్చీరప్ప, రామాంజనేయు లు డిమాండ్‌ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు మూడు నెలల పాటు నెలకు రూ.7,500 నగదు, 200 రోజులు ఉపాధి హామీ పని కల్పించి రూ.600 వేతనం, ఉచితంగా రేషన్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.


ఆలూరు: వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు నారాయణస్వామి, హనుమంతు డిమాండ్‌ చేశారు. గురువారం ఆలూరు గ్రామ సచివాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజు, బాషా, సీఐటీయూ మండల కార్యదర్శి షాకీర్‌, డీవైఎ్‌ఫఐ నాయకుడు మైన, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు గోవర్ధన్‌, సురేంద్ర, రంగనాథ్‌ పాల్గొన్నారు. 


నందికొట్కూరు రూరల్‌: లాక్‌ డౌన్‌ వల్ల ఉపాధి లేక అవస్థలు పడుతున్న వ్యవసాయ కార్మికులకు, ఉపాధి కూలీలను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోరారు. మండలంలోని మల్యాల, వడ్డెమాను, నాగటూరు గ్రామాల్లో సచివాలయాల ఎదుట ధర్నా చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ కార్యదర్శి పక్కీర్‌ సాహెబ్‌, నాయకులు రజిత, శంకర గౌడు, నాయుడు పాల్గొన్నారు.


జూపాడుబంగ్లా: వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని కేవీపీఎస్‌, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. పారుమంచాల సచివాలయం ఎదుట ధర్నా చేశారు. 


మిడుతూరు: ఉపాధి కూలీల వేతనాలు పెంచాలని సీఐటీయూ మండల కార్యదర్శి నాగమణి డిమాండ్‌ చేశారు. తలముడిపి గ్రామ సచివాలయ సెక్రటరీ షాలు బాషాకు వినతి పత్రం అందించారు.


పత్తికొండటౌన్‌: వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దస్తగిరి, సురేంద్ర, సీఐటీయూ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలు ధర్నా చేశారు. 


పెద్దకడుబూరు: కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు 3 నెలల పాటు నెలకు రూ.7,500 ఇవ్వాలని వ్య కార్మిక సం నాయ కులు తిక్కన్న, పరమేష్‌ అన్నారు. గురువారం పెద్దకడబూరు సచివా లయం-1 సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఉపాధి పనిలో మృతిచెందిన కూలీలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.


నందవరం: మండలంలోని రాయచోటి గ్రామం వలస కూలీలను ఆదుకో వాలని సీపీఎం నాయకుడు దేవపుత్ర డిమాండ్‌ చేశారు. గురువారం రాయ చోటి లో నిరసన తెలిపారు. 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలని కోరారు. లాక్‌ డౌన్‌ కారణంగా రూ7.500 ఇవ్వాలని కోరారు. స్వామిదాసు, దస్తగిరి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T11:04:54+05:30 IST