పాఠశాలల్లో మన ఊరు-మన బడి పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-12T04:59:05+05:30 IST

పాఠశాలల్లో మన ఊరు-మన బడి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. ఆయన బుధవారం లింగంపేట మండలంలోని లింగంపేట, శెట్పల్లి, సజ్జన్‌పల్లి, ఎక్కపల్లి, పర్మల్ల, పర్మల్లతండా, శెట్పల్లి సంగారెడ్డిల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన పరిశీలించారు.

పాఠశాలల్లో మన ఊరు-మన బడి పనులు వేగవంతం చేయాలి
శెట్పల్లిలో పాఠశాలలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

 - వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి కావాలి

 - కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ 

లింగంపేట, మే 11 : పాఠశాలల్లో మన ఊరు-మన బడి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. ఆయన బుధవారం లింగంపేట మండలంలోని లింగంపేట, శెట్పల్లి, సజ్జన్‌పల్లి, ఎక్కపల్లి, పర్మల్ల, పర్మల్లతండా, శెట్పల్లి సంగారెడ్డిల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన పరిశీలించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పాఠశాలల్లో ఏమి అవసరాలు ఉన్నాయో గుర్తించి ఆయా ప్రధానోపాధ్యాయులు పనులు చేయించుకోవాలని ఆయన సూచించారు. మన ఊరు-మన బడి పథకంలో మంజూరైన నూతన భవనాల డిజైన్ల ప్రతిపాదనలు ఎలా తయారు చేయాలో ఏఈలు ప్రధానోపాధ్యాయులకు వివరించారు. అందరికి అనుకూలంగా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ఏఈ రవితేజ, ఎంఈవో రామస్వామి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. 


పంటల సాగుపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి : పంట దిగుబడులను సాధించడానికి రైతులు పోటీపడే విధంగా వ్యవసాయ అధికారులు పంటల సాగుపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్లస్టర్‌ పరిధిలో అధిక దిగుబడి సాధించిన రైతుల ఫొటోలను రైతు వేదికలలో ఏర్పాటు చేయాలని తెలిపారు. పంటల మార్పిడి పద్ధతిని అవలంభిస్తే పంట దిగుబడులు పెరిగి రైతులు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారని తెలిపారు. రైతులు లాభాసాటి వ్యవసాయం చేసేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు పండిస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని అధికారులు అవగాహన సదస్సులో తెలియజేయాలని తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వచ్చే పంటల సాగుగురించి అవగాహన కల్పించాలన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు దృష్టి సారించే విధంగా చూడాలన్నారు. రైతులు ఒకే రకం పంటలు వేయవద్దని, ఇతర పంటల సాగు వైపు మొగ్గుచూపేలా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మీ, ఉద్యానవన అధికారి సంజీవరావు, సహకార శాఖ అధికారి వసంత తదితరులు పాల్గొన్నారు.

Read more