ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ABN , First Publish Date - 2022-05-22T04:28:19+05:30 IST

ప్రజల సౌకర్యార్ధం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ప్రారంభించిన మాతా శిశు వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ అరవింద్‌తో కలిసి సందర్శిం చారు.

ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ఆసుపత్రిలోని వార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

 

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 21: ప్రజల సౌకర్యార్ధం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ప్రారంభించిన మాతా శిశు వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని  కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ అరవింద్‌తో కలిసి సందర్శిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మారుమూల గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, రోగుల తాకిడి దృష్ట్యా జిల్లాలో మాతా శిశు వైద్యశాలను ప్రారంభించామన్నారు. ప్రసూతి, చిన్న పిల్లల వార్డులతోపాటు ఓపీ, ఇతర వార్డులను, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.  వారి వెంట వైద్యులు, సిబ్బంది ఉన్నారు. 

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి 

జిల్లాలో ఈనెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. డీసీపీ అఖిల్‌మహాజన్‌తో కలిసి  శ్రీచైతన్య, ఆర్‌బీహెచ్‌వీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 58 పరీక్ష కేంద్రా లను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రానికి సమ యానికి చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపిం చాలని, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌ సరఫరా ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని తెలిపారు. 

Updated Date - 2022-05-22T04:28:19+05:30 IST