యూనివర్శిటీల్లో జాతీయ విద్యా విధానం అమలు జరిగేలా చూడాలి

ABN , First Publish Date - 2021-02-25T05:04:28+05:30 IST

యూనివర్శిటీల్లో జాతీయ విద్యావిధానం అమలు జరిగేలా చూడాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వీసీలకు సూచించారు.

యూనివర్శిటీల్లో జాతీయ విద్యా విధానం అమలు జరిగేలా చూడాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వీసీ సూర్యకళావతి

కడప(వైవీయూ), ఫిబ్రవరి 24: యూనివర్శిటీల్లో జాతీయ విద్యావిధానం అమలు జరిగేలా చూడాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వీసీలకు సూచించారు. యూనివర్శిటీల పాలనా సంస్కరణలపై బుధవారం రాష్ట్రంలోని యూ నివర్శిటీలోని వీసీలతో రాష్ట్ర గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్శిటీ సౌత్‌జోన్‌ వీసీలతో వర్చ్యువల్‌ విధానంలో సమాయత్తమయ్యారు. సమావేశంలో వైవీయూ వీసీ సూర్యకళావతి పాల్గొన్నారు. యూనివర్శిటీ అభివృద్ధి గురించి గవర్నర్‌కు వివరించారు. కార్యక్రమంలో విద్యావేత్తలు, ఎన్‌హెచ్‌ఆర్‌డీ ప్రతినిధులు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.


ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించండి

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వీసీ సూర్యకళావతి అన్నారు. వైవీయూలోని ఎన్‌ఎ్‌సఎ్‌స ఆధ్వర్యంలో చింతకొమ్మదిన్నె మండలం శివాజీనగర్‌లో వారం రోజుల ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరాన్ని వీసీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైవీయూ ఎన్‌ఎ్‌సఎ్‌స యూనిట్‌ 1, 3 ఆధ్వర్యంలో ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లు గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం నింపేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ పథకాలపట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సాంబశివారెడ్డి, ఎన్‌ఎ్‌సఎ్‌స సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డి, పోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ గోవర్ధన్‌నాయుడు, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ సునీత, డాక్టర్‌ సుమిత్ర, వలంటీర్లు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-25T05:04:28+05:30 IST