ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-05-29T09:55:45+05:30 IST

ఆపదలో ఉన్న వారిని అభిమాన సంఘ సభ్యులు ఆదుకోవాలని, పట్టణ నందమూరి సేవా సంఘం అధ్యక్షుడు మజ్జి ..

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి

పార్వతీపురంటౌన్‌, మే 28: ఆపదలో ఉన్న వారిని అభిమాన సంఘ సభ్యులు ఆదుకోవాలని, పట్టణ నందమూరి సేవా సంఘం అధ్యక్షుడు మజ్జి కృష్ణరావు, యువ జన విభాగం అధ్యక్షుడు శ్రీనివాసరావు కోరారు. గురువారం ఎన్టీఆర్‌ జయంతి సంద ర్భంగా జగన్నాఽథపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న యర్పాటి పోలినాయుడు కుటుంబ సభ్యులకు రూ.2వేలు ఆర్థికసాయంతో పాటు నిత్యావసరాలు అందించారు.


కొత్తవలస:  కొత్తవలస మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తిక్కాన చినదేముడు, మాజీ ఎంపీపీ  రాజన్న,  పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ తదితరులు కొత్తవలస జంక్షన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు నిత్యావసరాలను అందజేశారు.  గొరపల్లి రాము, నక్కరాజు రాము, పీవీ రత్నాజీ, కొరుపోలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 


ముగిసిన మహానాడు 

పార్వతీపురం: టీడీపీ మహానాడు కార్యక్ర మం గురువారంతో ముగిసింది. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ డి.శ్రీదేవి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్య కర్తలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో  పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, తదితర నాయ కుల ప్రసంగాన్ని తిలకించారు.   టీడీపీ నేతలు ఉదయబాబు, సీతారాం, వెంకటరావు, వెంకటి నాయుడు, జి.రామ్మూర్తి, దేవీచంద్రమౌళి, మోహన్‌, జనార్దననాయుడు,  తిరుపతిరావు, గౌరునాయుడు, తిరుపతి, పాల్గొన్నారు. 


మెరకముడిదాం : టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని స్థానిక  పార్టీ కార్యాలయం నుంచి నేతలు ఫోన్‌లో జూమ్‌ యాప్‌ద్వారా వీక్షించారు. అధినేత, ముఖ్యనాయకుల ప్రసంగాలను విన్నారు. టీడీపీ చీపురుపల్లి  నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున పాత్రికేయలకు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను  టీడీపీ మండల అధ్యక్షుడు  రెడ్డి గోవింద్‌నాయుడు  అందజేశారు.  శ్రీధరరావు,  ధనుంజయ,   బంగారునాయుడు, పరుశురా మలు, బంగ్రారాజు, రెడ్డి వెంకటి, పైడన్న  పాల్గొన్నారు.


తెర్లాం: స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద మండల నాయకులు ఎన్‌.వెంకటనాయుడు, వెంకటేష్‌లతో కలిసి గ్రామస్థాయి నేతలు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు. 

Updated Date - 2020-05-29T09:55:45+05:30 IST