Abn logo
Sep 27 2021 @ 00:05AM

కుల వివక్షలేని సమాజాన్ని నిర్మించాలి

సమావేశంలో మాట్లాడుతున్న బత్తినయ్య

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 26: కులం, మతం, జాతి వివక్షలేని సమాజాన్ని నిర్మించాలని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజూరు బాలసుబ్రహ్మణ్యం కోరారు. పట్టణ ప్రైవేటు కల్యాణ మండపంలో శనివారం రాత్రి బోయి భీమన్న, గుర్రం జాషువా జయంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా కరోనా సమయంలో వెల్లివిరిసిన మానవత్వం అన్న అంశంపై నిర్వహించిన కవితా పోటీల విజేతలు వరలక్ష్మి, దర్బావారి సుబ్రహ్మణ్యం, రమే్‌షకు ప్రముఖులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖులు పిళ్లారి బత్తినయ్య, మించల శంకరయ్య, పసల వీరాస్వామి, శ్రీనివాసరావు, ఈశ్వరయ్య, చిలకా రంగయ్య, గరికపాటి రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.