సుప్రీం కోర్టు నిర్ణయాన్ని... వినమ్రంగా స్వీకరిస్తున్నాం - టాటా సన్స్

ABN , First Publish Date - 2022-05-19T21:42:51+05:30 IST

రతన్ టాటా తర్వాత TSPL ఛైర్మన్‌గా 2012 లో బాధ్యతలు స్వీకరించిన సైరస్ మిస్త్రీ... నాలుగేళ్ల తర్వాత తొలగింపునకు గురైన విషయం తెలిసిందే.

సుప్రీం కోర్టు నిర్ణయాన్ని... వినమ్రంగా స్వీకరిస్తున్నాం  - టాటా సన్స్

న్యూఢిల్లీ : రతన్ టాటా తర్వాత TSPL ఛైర్మన్‌గా 2012 లో  బాధ్యతలు స్వీకరించిన  సైరస్ మిస్త్రీ... నాలుగేళ్ల తర్వాత తొలగింపునకు గురైన విషయం తెలిసిందే. Tata Sons ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2021 మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ  సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ‘నమ్రతతో స్వాగతిస్తున్నాం’మంటూ టాటా సన్స్ గురువారం పేర్కొంది.


‘గౌరవ సుప్రీం కోర్ట్ ఈరోజు ఇచ్చిన ఆదేశాలను వినమ్రతతో స్వాగతిస్తున్నాం. గత సంవత్సరం ఏకగ్రీవ తీర్పు ద్వారా tata group స్థితిని ఇది మరోసారి పునరుద్ఘాటిస్తుంది’ అని తీర్పు వెలువడిన తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో టాటా సన్స్ పేర్కొంది. ‘టాటా సన్స్ దేశ నిర్మాణం కోసం పని చేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది’ అని పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ రతన్ టాటా ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం భారత న్యాయవ్యవస్థ విలువను, నైతికతను బలోపేతం చేసిందని ఆయన పేర్కొన్నారు.


మిస్త్రీ 2012 లో రతన్ టాటా తర్వాత టీఎస్‌పీఎల్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే... నాలుగేళ్ల తర్వాత పదవి నుంచి తొలగింపునకు గురయ్యారు. కాగా... మార్చి 2021 నాటి తీర్పులో సైరస్ మిస్త్రీపై చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. సపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపు దరఖాస్తులో పేర్కొన్న కారణాల వల్ల కాకుండా ఒకటి లేదా కొన్ని వాక్యాలను తొలగించేందుకు అనుమతించాల్సిందిగా టాటా గ్రూపు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోరారు.


కాగా... మార్చి 26, 2021 న, మిస్త్రీని $100-బిలియన్ సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ సమ్మేళనానికి ఎగ్జ్సిక్యూటివ్ ఛైర్మన్‌గా పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) ఆర్డర్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్(టీఎస్‌పీఎల్)లో యాజమాన్య ప్రయోజనాలను విభజించాలని కోరుతూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Updated Date - 2022-05-19T21:42:51+05:30 IST