పేద ప్రజలను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-03-30T10:58:53+05:30 IST

రాష్ట్రం లో విపత్కార పరిస్థితులు ఉన్నా పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవ ద్దని ఉప ముఖ్యమంత్రి పాముల

పేద ప్రజలను ఆదుకుంటాం

1న పింఛను, 4న వెయ్యి రూపాయలు

మూడు విడతల్లో ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి


విజయనగరం(ఆంధ్రజ్యోతి), మార్చి 29: రాష్ట్రం లో విపత్కార పరిస్థితులు ఉన్నా పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవ ద్దని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు.  జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో తెలుపు రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా బియ్యం, కందిపప్పును ఆదివారం ఆమె పంపిణీ చేశారు. డిపో వద్ద పంపిణీ చేసే సమ యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, సిబ్బం దికి సూచనలు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా ఉం టుందన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినా నిత్యావసర సరుకుల పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.


మూడు విడతలుగా బియ్యం, కందిపప్పు, పంపిణీ చేస్తామన్నారు. ఏప్రిల్‌ 1న సామా జిక పింఛన్లు, 4న తెలుపు రేషన్‌ కార్డుదారులకు వెయ్యి రూపాయలు అందజేస్తామని తెలిపారు. కరోనా వైరస్‌ నివారణకు, ప్రజలకు సేవలు అందించడంలో గ్రామ, వార్డు వలంటీర్ల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు మీడియా సేవలు కూడా ప్రశంసనీయమని తెలిపారు. స్వీయనిర్బంధంతోనే కరోనా వైరస్‌ నివారించుకోవచ్చన్నారు. అనంతరం స్థానిక ఎమ్మె ల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీ కిశోర్‌ కుమార్‌, ఆర్డీవో హేమలత, తహసీల్దార్‌ సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ అధికారి కృపా, వైసీపీ నాయకులు కనకల ప్రసాద్‌, కంటుభుక్త తవిటిరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని పీడబ్ల్యూ మార్కెట్‌, చిన మార్కెట్‌, గంటస్తంభం ప్రాంతాల్లోని కూర గాయల హోల్‌సేల్‌ షాపులు తెరిపించేలా చూడాలని ఉప ముఖ్యమంత్రికి టోకు కూర గాయల వ్యాపారులు వినతిపత్రం అంద జేశారు.


బొబ్బిలి రూరల్‌: పక్కి గ్రామంలోని రేషన్‌ డిపోలో తెలుపు రేషన్‌కార్డుదారులకు ఆదివారం బియ్యం, కందిపప్పు, పంచదారను ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ డిపోల వద్ద సామాజిక దూరం పాటించి  సరుకులు తీసుకోవాలన్నారు. పేదలను ఆదు కునేందుకు ప్రభుత్వం ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మణ ప్రసాద్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో బి.రామారావు, సీఎస్‌డీటీ గౌరీశంకర్‌,మాజీ సర్పంచ్‌ శంబంగి వేణుగోపాలనాయు డు పాల్గొన్నారు.


బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలోని ఐదారు వార్డుల్లో రేష న్‌ పంపిణీ సమయంలో కార్డుదారులు సామాజిక దూ రం పాటించలేదు. సరుకులు తీసుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. గొల్లవీధి రేషన్‌ డిపోను డిప్యూటీ తహసీల్దా రు సాయికృష్ణ పర్యవేక్షించారు. ఏఎస్‌ఐ రమణ పలు వార్డుల్లోని డిపోల వద్ద ప్రజలు క్యూలో ఉండేలా చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల కార్డుదారులు వలంటీర్లతో వాగ్వా దానికి దిగారు. బొబ్బిలి పట్టణ, మండల పరిధిలో మెత్తం 67 రేషన్‌ డిపోలుండగా వాటిలో 15 డిపోలకు సరుకులు రావడం ఆలస్యమైందని తహసీల్దార్‌ లక్ష్మణ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం నుంచి అన్ని షాపుల్లో నూ సరుకుల పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూస్మా ని చెప్పారు. గంటకు 20 మందికే కూపన్లు ఇవ్వాలని సీఐ కేశవరావు డిపో డీలర్లకు ఆదేశించారు. 


చీపురుపల్లి: కరోనా కారణంగా ఉపాధికి దూరమై, ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకునేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. పేదలకు మంజూరు చేసిన ఉచిత బియ్యం, కంది పప్పును ఆదివారం వంగపల్లిపేటలో వైసీపీ నాయ కుడు మజ్జి శ్రీనివాసరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అన్ని వర్గాలు ఉపాధిని కోల్పోయాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆందరినీ ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని, తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికి బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తున్నా మన్నారు. ఆకలితో ఉన్న ఆనాధలకు ప్రభుత్వ వసతి గృహాల్లో వసతి, ఉచిత భోజనం కూడా ఇచ్చే ప్రతిపాదన ఉందని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ పిన్నింటి రామారావు, డీలర్‌ వి. గోపాల్‌, నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పొన్నాడ రమణ, మీసాల విశ్వేశ్వర రావు, వలిరెడ్డి లక్ష్మణరావు, గరిడ రాందాసు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T10:58:53+05:30 IST