ఆ ఒక్కటి తప్ప, దేనికైనా సిద్ధమే: కేంద్ర మంత్రి తోమర్

ABN , First Publish Date - 2021-07-01T21:44:01+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 25 నుంచి ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఆందోలన నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకవడం మినహా మరే ప్రతిపాదనకు

ఆ ఒక్కటి తప్ప, దేనికైనా సిద్ధమే: కేంద్ర మంత్రి తోమర్

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం మినహా మరే ఇతర డిమాండ్‌ను అయినా పరిగణలోకి తీసుకుని చర్చించేందుకు సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. గతంలో అనేకసార్లు జరిగిన చర్చల్లో రైతులతో ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘రైతులకు మేము ఇది వరకే స్పష్టం చేశాం. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం మినహా రైతులు ఏ ప్రతిపాదన చేసినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 25 నుంచి ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఆందోలన నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకవడం మినహా మరే ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు అంటుంటే.. ఉపసంహరణ మినహా మరేదైనా మాట్లాడడానికి సిద్ధమేనని ప్రభుత్వం పట్టుబట్టి కూర్చుంది. దీంతో ప్రభుత్వం, రైతు సంఘాల 12 సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

Updated Date - 2021-07-01T21:44:01+05:30 IST