విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలి

ABN , First Publish Date - 2020-03-27T09:55:04+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలను చేపట్టామని జడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి సూచించారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలి

కడప రూరల్‌, మార్చి 26 : జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలను చేపట్టామని జడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి సూచించారు. గురువారం జడ్పీలోని సీఈఓ చాంబర్‌లో కరోనా కట్టడి చర్యలపై ఏఓలతో సమీక్షించారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రూరల్‌ ఏరియాలో కరోనా కట్టడికి అన్నిరకాల చర్యలను చేపట్టామన్నారు. జిల్లాలోని 50 మండలాల ఎంపీడీఓలను, ఇతర శాఖల అధికారులను, వలంటీర్లను అప్రమత్తం చేశామన్నారు.


విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నామన్నా రు. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. గుంపులు గుంపులుగా ఉండరాదన్నా రు. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కరోనా వైరస్‌ సోకే అవకాశం ఎ క్కువగా ఉందన్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు, గర్భవతులకు వైరస్‌ త్వరగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దగ్గు, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి, జర్వరం వంటి లక్షణాలున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించిపరీక్షలు చేయించుకోవాలన్నారు. చేతులను ఎప్పటికప్పుడు శభ్రపరుచుకోవాలన్నారు. ఇంటింటినీ సర్వేచేస్తోందన్నారు. కరోనా పట్ల అవగాహన కోసం 08562 254259, 259179కు ఫోన్‌ చేయాలని కోరారు. డిప్యూటీ సీఈఓ నాగిరెడ్డి పలు విభాగాల ఏఓలు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T09:55:04+05:30 IST