ఆతిథ్య దేశంగా మా బాధ్యత నిర్వహించాం: జపాన్

ABN , First Publish Date - 2021-08-10T00:45:32+05:30 IST

ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన దేశంగా జపాన్ తన బాధ్యత నిర్వహించిందని ఆ దేశ ప్రధాని యోషిహిడె సుగా సోమవారం ప్రకటించారు.

ఆతిథ్య దేశంగా మా బాధ్యత నిర్వహించాం: జపాన్

టోక్యో: ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన దేశంగా జపాన్ తన బాధ్యత నిర్వహించిందని ఆ దేశ ప్రధాని యోషిహిడె సుగా సోమవారం ప్రకటించారు. విశ్వక్రీడల నిర్వహణకు సహకరించిన దేశ ప్రజలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు. ‘‘క్రీడల నిర్వహణకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నో ఆంక్షల నడుమ టోక్యోలో విశ్వక్రీడలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. విశ్వక్రీడల కారణంగా కరోనా కేసులు పెరుగుతాయనే అనుమానాలతో జపాన్ ప్రజల్లో కొందరు ఒలింపిక్స్‌ను వ్యతిరేకించారు. 

Updated Date - 2021-08-10T00:45:32+05:30 IST