Abn logo
Jul 27 2021 @ 00:13AM

గ్రీన్‌ఫీల్డ్‌ వద్దు.. పొలాలే ముద్దు

రిలే దీక్ష చేస్తున్న రైతులు

  రైతుల రిలే దీక్ష

మెంటాడ, జులై 26: గ్రీన్‌ ఫీల్డ్‌ వద్దు.. పచ్చని పొలాలు ముద్దు అంటూ స్థానిక రైతులు మెంటాడ లో సోమవారం రిలే దీక్ష చేపట్టారు. సబ్బవరం నుంచి రాయపూర్‌ వరకు నిర్మిస్తున్న అంతర్రా ష్ట్ర రహదారిని వెంటనే నిలుపుదల చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి వల్ల తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను నష్టపోతున్నారని చెప్పారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ధర్నా చేశారు. మెంటాడకు చెందిన జానపద గాయకుడు గండ్రేటి శ్రీనివాసరావు పాటలతో రైతులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటిరాములు, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ గండ్రేటి అప్పలనాయుడు, జయతి, మెంటాడ మాజీ సర్పంచ్‌లు బెవర వీరినాయుడు, పాండ్రంకి సన్యాసిరావు, బీజేపీ  జిల్లా సీనియర్‌ నాయకులు నాళం రాంప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు.