Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 03 Jul 2022 03:58:21 IST

అర్థం కాకూడదనే ట్రైలర్‌ అలా కట్‌ చేశాం!

twitter-iconwatsapp-iconfb-icon

‘మత్తు వదలరా’ అంటూ తొలి అడుగులోనే ఆకట్టుకొన్న దర్శకుడు రితేష్‌ రానా. పరిమిత వనరులతో, ఓ కొత్త కాన్సెప్ట్‌ని విజయవంతంగా చూపించిన విధానం ఆకట్టుకొంది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రాన్ని రూపొందించారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన చిత్రమిది. అగస్త్య, సత్య, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. జులై 8న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రితేష్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం మన సమాజంలో గన్స్‌ లీగల్‌ కాదు. అందరి దగ్గర గన్స్‌ ఉండడం కష్టం. అందుకే ఓ ఫేక్‌ వరల్డ్‌ క్రియేట్‌ చేద్దామన్న ఆలోచనతో ఈ కథని తయారు చేసుకొన్నా. కామెడీలో సర్రియల్‌ అనే జానర్‌ ఉంది. ఇప్పటి వరకూ ఈ జానర్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే సర్రియల్‌ జానర్‌లో ఈ కథ చెప్పాలనుకొన్నాను. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంటూనే, కథ అర్థం కాకూడదనుకొన్నాం. అందుకే ట్రైలర్‌ని అలా కట్‌ చేశాం. సత్య, అగస్త్య ‘మత్తువదలరా’లో కీలక పాత్రలు పోషించారు. వాళ్ల టైమింగ్‌ నచ్చింది. అందుకే మళ్లీ వాళ్లనే తీసుకొన్నా. టెక్నికల్‌ టీమ్‌ కూడా తొలి సినిమాకి పనిచేసినవాళ్లే.  వాళ్లతో నాకు ట్యూను కుదిరింది. లావణ్య త్రిపాఠి శైలికి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర ఇది. ఈ పాత్రలో లావణ్యని చూస్తే అంతా షాకైపోతారు. నేను ఎంచుకొన్నవి భిన్నమైన కథలే కావొచ్చు. కానీ కమర్షియల్‌ హంగులు ఉన్నవే. పాటలూ, ఫైటింగులే కమర్షియల్‌ అంశాలు అని అనుకోను. డబ్బులు వెనక్కి తీసుకొచ్చే ప్రతీ సినిమా కమర్షియల్‌ సినిమానే. మైత్రీ మూవీ్‌సలోనే మూడో సినిమా చేస్తున్నా. రెండు కథలు సిద్ధం చేశా. వాటిలో ఒకటి ఎంచుకోవాల’’న్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement