Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాచిపట్టిన నీటితో భరించలేకున్నాం

ప్రొద్దుటూరు రూరల్‌, డిసెంబరు 5:  మండల పరిధిలోని చెన్నమరాజుపల్లె గ్రామ పంచాయతీ నాగాయపలె ్ల గ్రామంలో వీధులన్నీ వర్షపునీరు నిలిచి పాచిపట్టి దుర్గంధం వెద జల్లుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో సుమారు 350 కుటుంబాల వారు నివశిస్తున్నారని ఆదర్శ అంగన్వాడీ కేంద్రం ఎదురుగా కూడా ఎక్కువగా వర్షపునీరు చేరి రోడ్డంతా అధ్వానంగా ఉందన్నారు. ఈ బురదనీటిలోనే అంగన్వాడీ చిన్నారులు వారితోపాటు తల్లిదండ్రులు నిత్యం నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలా నివాసాల మధ్య, ఖాళీ స్థలాల్లో భారీగా వర్షపునీరు చేరి పాచిపట్టిందని పలు మార్లు  గ్రామ పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితంలేదని  వాపోతున్నారు. గ్రామంలో కొన్ని వీధుల్లో సిమెంటు రోడ్డు ఉన్నప్పటికి అవి కూడా బురదమయంగా ఉన్నాయని దీంతో దోమలు అధికమై ఇబ్బందులు పడుతున్నామన్నారు.  అధికారులు వచ్చి బ్లీచింగ్‌ చల్లడం కానీ, దోమల మందు స్ర్పే చేయడం కాని చేయలేదన్నారు. 

 వాసనతో ఉండలేకపోతున్నాం

- నారాయణమ్మ, గ్రామస్థురాలు

ఇళ్ల ముందర పాచిపట్టిన మురుగు ఉండడంతో దుర్వాసన అధికమై ఉండలేకపోతున్నాం. ఈ మురుగునీటి కారణం గ్రామంలో దోమలుకూడా అధికమయ్యాయి. గ్రామంలోకి అధికారులు వచ్చి ఏనాడూ బ్లీచింగ్‌ చల్లలేదు. మేము మనుషులమేనని అధికారులు గుర్తించండి 

త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం

ఈ విషయంపై చెన్నంరాజుపల్లె  గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా  త్వరలోనే  గ్రామంలో పర్యటించి వర్షపునీరు వెల్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉన్న విషయం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని అయితే విషయం ఆలస్యంగా తెలిసిందని ఆమేరకు చర్యలు తీసుకుంటామన్నారు.


Advertisement
Advertisement