పని ఒత్తిడి భరించలేకున్నాం

ABN , First Publish Date - 2022-04-25T05:50:37+05:30 IST

రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడి భరించలేకున్నామని, తమపై పనిభారం తగ్గించాలని కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు జిల్లాలోని పలువురు తహసీల్దార్లు తీర్మానించారు. జగనన్న గృహ నిర్మాణ పనుల భారం, రోజువారీ రెవెన్యూ విధులు, ఉన్నతాధికారులతో నిత్యం టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, తదితరాలపై ఏపీ రెవెన్యూ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జీవన్‌ చంద్రశేఖర్‌, అలీఖాన్‌, ఇక్బాల్‌బాష తదితరులతో ఆదివారం రెండో పర్యాయం పాత కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించారు.

పని ఒత్తిడి భరించలేకున్నాం

కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు తీర్మానం

మళ్లీ సమావేశమైన తహసీల్దార్లు 

కడప(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 24: రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడి భరించలేకున్నామని, తమపై పనిభారం తగ్గించాలని కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు జిల్లాలోని పలువురు తహసీల్దార్లు తీర్మానించారు. జగనన్న గృహ నిర్మాణ పనుల భారం, రోజువారీ రెవెన్యూ విధులు, ఉన్నతాధికారులతో నిత్యం టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, తదితరాలపై ఏపీ రెవెన్యూ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జీవన్‌ చంద్రశేఖర్‌, అలీఖాన్‌, ఇక్బాల్‌బాష తదితరులతో ఆదివారం రెండో పర్యాయం పాత కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రోజువారీ విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఉన్నతాధికారుల ఒత్తిడులపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. జగనన్న గృహ నిర్మాణ పనులకు సంబంధించి ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుండగా తహసీల్లార్లను, రెవెన్యూ యంత్రాంగాన్ని బాధ్యులుగా చేస్తూ ఉన్నతాధికారులు తమను ఒత్తిడికి గురి చేస్తుండటంపై జిల్లాలోని తహసీల్దార్లంతా ముక్తకంఠంతో తమ ఆదేవన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉదయం మొదలుకొని రాత్రి వరకు టీసీలు, వీసీలు, రోజువారీ సమీక్షలతో రాత్రి వరకు విధులు నిర్వహించాల్సి రావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం స్పందన కార్యక్రమం మధ్యాహ్నం వరకు చూసిన తరువాత మండలాల నుంచి మధ్యాహ్యం 2 గంటలకు కలెక్టరేట్‌లో జరిగే జగనన్న గృహ నిర్మాణ పనులకు సంబంధించిన సమావేశానికి రావడం కష్టంగా ఉందని వారు వాపోయినట్లు తెలుస్తోంది. ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించే ందుకు ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ నేతలు, జిల్లాలోని తహసీల్దార్లంతా కలెక్టర్‌ విజయరామరాజును కలసి తమ బాధలను తెలుపుతూ వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-04-25T05:50:37+05:30 IST