కాలుష్యం భరించలేకున్నాం

ABN , First Publish Date - 2021-09-29T06:26:28+05:30 IST

అక్సోరా ఫ్యాక్టరీ వ్యర్థాలతో కాలుష్యం బారినపడి మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయనీ, మనుషులు కూడా బలికావాల్సి వస్తుందేమోనని రౌతుసూరమాల గ్రామస్థులు వాపోయారు.

కాలుష్యం భరించలేకున్నాం
రౌతుసూరమాల గ్రామస్థులతో మాట్లాడుతున్న అధికారులు

తొట్టంబేడు, సెప్టెంబరు 28: ఫ్యాక్టరీ వ్యర్థాలతో ఇబ్బంది పడుతు న్నాం. కాలుష్యం బారినపడి మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. ఇకపై మనుషులు కూడా బలికావాల్సి వస్తుందేమోనని మండలంలోని రౌతుసూరమాల గ్రామస్థులు వాపోయారు. ఈ గ్రామ సమీపంలోని అక్సోరా రీసోర్స్‌ లిమిటెడ్‌ కంపెనీని మంగళవారం కాలుష్యనియంత్రణ మండలి అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గ్రామ పొలిమేరల్లో ఫ్యాక్టరీ వ్యర్థాలు వేయడం సమస్యగా మారిందన్నారు. ఇందులో పొర్లి 20కిపైగా బర్రెలు, ఆవులు, మూగజీవాలు చనిపోయినట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నరేంద్ర, కిశోర్‌ అక్సోరా యాజమాన్యం నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం కర్మాగారం నుంచి విడుదలయ్యే వ్యర్థాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ప్రమాదమని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీఇచ్చారు. 

Updated Date - 2021-09-29T06:26:28+05:30 IST