అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

ABN , First Publish Date - 2021-01-24T05:55:58+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించాలనిహైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది.

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

టీఎ్‌సయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 23: తమ సమస్యలను పరిష్కరించాలనిహైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీఎ్‌సయూటీఎఫ్‌, వేదిక ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరును ఖండించారు. అటు ఎస్టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ  ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో పీఆర్సీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టిన ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనంతరం కలెక్టరే ట్‌ లోకి ఉపాధ్యాయులు దూసుకుపోగా, వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారించిన ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇందులో డి.శేఖర్‌, మురళి, భీంరావ్‌, ఉపాధ్యాయులు, తదితరులున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని జాక్టో, యూఎ్‌సపీసీ సంయుక్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. 

 ఉట్నూర్‌: ఉపాధ్యాయ, ఉద్యోగుల, ఫెన్షనర్‌ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ఐక్య వేధిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. శనివారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద  నిరసన ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ముడుగు శామ్యూల్‌, టీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు చంద్రకాంత్‌, కపిల్‌కుమార్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దిలేష్‌ చౌహాన్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు ఆత్రం సుగుణ, డీటీఎఫ్‌ జిల్లా నాయకురాలు రాథోడ్‌ రవి, కుమ్ర శ్రీనివాస్‌, సి.వీరయ్య, కేజీ లక్ష్మయ్య, లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చోడ: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌కు అతికోద్దిన్‌కు టీఎస్‌యూటీఎఫ్‌  ఇచ్చోడ, సిరికొండ మండలాలకు చెందిని నాయకులు వినతిపత్రం అందజేశారు.  

జైనథ్‌: పీఆర్సీసి నివేదికను బహిర్గత పరిచి, దాన్ని అమలు పరిచే వరకు నిరంతరం పోరాటం నిర్వహిస్తామని టీఎ్‌సయూటీఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి నైతంగణేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జైనథ్‌ మండలంలోనిపార్డి(బి), పెండల్‌వాడ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-01-24T05:55:58+05:30 IST