Abn logo
Nov 29 2020 @ 01:07AM

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

-15వ తేదీలోగా రైతులకు నష్టపరిహారం

-తెగిన చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

   పీలేరు, నవంబరు 28: తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను అన్ని విఽధాలా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పింఛా ఏటి ప్రవాహంలో సదుం మండలం  ఎగువకురవపల్లెకు చెందిన గుడే రమణ భార్య రామలక్ష్మమ్మ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం పోలీసులు ఆమె మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి ఆస్పత్రి వద్దకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  రామలక్ష్మమ్మ భర్త రమణకు ప్రభుత్వం తరపున రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ  తుఫాను కారణంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో అపారనష్టం వాటిల్లిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.ఐదు లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 15వతేదీలోగా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని  సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. దెబ్బతిన్న చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహిస్తామని చెప్పారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పీలేరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాఽథరెడ్డి, కలెక్టర్‌ భరత్‌గుప్తా, సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పీలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడప గిరిధర్‌రెడ్డి, కంభం సతీ్‌షరెడ్డి, ఏటీ రత్నశేఖర్‌రెడ్డి, మైనార్టీ నాయకుడు ఎస్‌. హబీబ్‌బాషా, చక్రపాణిరెడ్డి, చక్రధర్‌, తహసీల్దార్‌ పుల్లారెడ్డి, సీఐ సాదిక్‌అలీ, ఎస్‌ఐ తిప్పేస్వామి, పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement