ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2020-04-03T10:19:37+05:30 IST

రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్‌ డి. సంజీవరెడ్డితో కలిసి గురువారం

ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం

  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 2: రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్‌ డి. సంజీవరెడ్డితో కలిసి గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన సన్నరకాల ధాన్యాన్ని మిల్లర్లు, ట్రేడర్లు రైతుల వద్దకే వెళ్లి  కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్ర భుత్వం నిర్దేశించిన మద్దతు ధర ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దన్నారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 203, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 103 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తేమ శాతం లేకుండా ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచి శానిటైజర్లు ఏర్పాటు చేయాల న్నారు. సమావేశంలో జిల్లా రైతు సమన్వయ కమిటీ కన్వీనర్‌ రజాక్‌, డీఎ్‌సవో విజయలక్ష్మి, సివిల్‌ సప్లయిస్‌ డీఎం పుల్లయ్య, ఏడీఏ జ్యోతిర్మయి పాల్గొన్నారు.


విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ 

లాక్‌డౌన్‌ విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ తెలిపారు. గురువారం జిల్లా కేంద్ర సమీపంలోని చందన నర్సింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రం, ఇమాంపేట వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలీసులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. విదేశాలు, ఢిల్లీ జమాత్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌ కేంద్రాలకు రావాలని సూచించారు. 

Updated Date - 2020-04-03T10:19:37+05:30 IST