రైతులనుంచి ప్రతి గింజనూ కొంటాం

ABN , First Publish Date - 2020-10-31T07:37:03+05:30 IST

రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.

రైతులనుంచి ప్రతి గింజనూ కొంటాం

డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి


యాదాద్రి రూరల్‌, అక్టోబరు 30: రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గౌరాయిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ధాన్యం అమ్మడానికి కిలోమీటర్ల దూరం వెళ్లి అనేక అవస్థలు పడేవారని, సీఎం కేసీఆర్‌ పాలనలో  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


  కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు ధాన్యం తీసుకురాగానే వెంటనే కొలతలు వేసి, వారినుంచి ధాన్యం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటి చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, గుట్ట  జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధబీరయ్య, రైతు సమన్వ సమితి మండల అధ్యక్షుడు జిన్న మాధవరెడ్డి, యాదగిరిగుట్ట పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇమ్మిడి రాంరెడ్డి, సర్పంచ్‌లు సిరికొండ సత్యనారాయణ, అనురాధ, మార్కెట్‌ కమిటి డైరెక్టర్‌ బూడిద ఐలయ్య, నాయకులు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్‌, శివరాత్రి నరేష్‌, రైతులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T07:37:03+05:30 IST