మనమే నెంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2022-05-24T06:59:15+05:30 IST

ఽధాన్యం సేకరణలో రాష్ట్రస్థాయిలోనే జిల్లా నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిం ది. ఈ యాసంగిలో జిల్లావ్యాప్తంగా రికార్డుస్థాయిలో ధాన్యాన్ని అధికారులు సేకరించారు. వాహనాలు, హమాలీలు, గన్నీల కొరత ఉన్నప్పటికీ.. పక్కా ప్రణాళికతో మిల్లులకు తరలిస్తున్నారు. అన్‌లోడింగ్‌ ఇబ్బంది అయినా.. వెంట వెంటనే అధికారులు తమ తమ పరిధిలో కిందిస్థాయి సిబ్బందిని సమన్వయ పరుస్తూ..

మనమే నెంబర్‌ వన్‌
గోదాంలో నిండిపోయిన ధాన్యంబస్తాలు

ధాన్యం సేకరణలో రాష్ట్రస్థాయిలోనే జిల్లా ఫస్ట్‌

ఈ యాసంగిలో 5.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

ఈ వారంలోపు ధాన్యం సేకరణ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు

మిల్లులు నిండడంతో సొసైటీ గోదాములలో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఽధాన్యం సేకరణలో రాష్ట్రస్థాయిలోనే జిల్లా నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిం ది. ఈ యాసంగిలో జిల్లావ్యాప్తంగా రికార్డుస్థాయిలో ధాన్యాన్ని అధికారులు సేకరించారు. వాహనాలు, హమాలీలు, గన్నీల కొరత ఉన్నప్పటికీ.. పక్కా ప్రణాళికతో మిల్లులకు తరలిస్తున్నారు. అన్‌లోడింగ్‌ ఇబ్బంది అయినా.. వెంట వెంటనే అధికారులు తమ తమ పరిధిలో కిందిస్థాయి సిబ్బందిని సమన్వయ పరుస్తూ.. ఈ వారంలోపు ధాన్యం సేకరణ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు కూడా వేగంగా చేస్తున్నా రు. రైతుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు. 

5.30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ధాన్యం కొనుగోలులో జిల్లా రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షల 30వేల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ఈ యాసంగిలోనే ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణ జరుగుతున్నా.. ఇంత పెద్దమొత్తంలో ధాన్యం కొనుగోలు ఏ జిల్లాలోనూ జరగలేదు. నిజామాబాద్‌ జిల్లా తర్వాత నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో గడిచిన నెలన్నర రోజులుగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 457కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఇప్పటి వరకు 71305 మంది రైతు ల నుంచి 5లక్షల 30వేల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు.  

ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైనా.. 

జిల్లాలో ఈ సంవత్సరం యాసంగిలో ధాన్యం సేకరణ కొంత ఆలస్యమైంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడంతో.. కొంతమంది రైతులు వ్యాపారులకు ముందుగానే విక్రయించారు. జిల్లాలో యాసంగిలో 9లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం వ స్తుందని అంచనా వేయగా.. 3లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు రైతులు వ్యాపారులకు అమ్మకాలు చేశా రు. మిగతా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నారు. జిల్లాలో ఆరు లక్షల మెట్రిక్‌ టన్ను ల వరకు సేకరించే అవకాశం ఉండడంతో.. త్వరగా ముగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పలుచోట్ల కొనుగోళ్లలో జరుగుతున్న గోల్‌మాల్‌ను రైతులు అధికారుల దృష్టికి తీసుకొస్తుండగా.. అధికారులు వాటి ని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ధాన్యం తరలింపును చేపడుతున్నారు. జిల్లాలో పలు సొసైటీల పరిధిలో తరుగు తీస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువగా రైతుల నుంచి వస్తుండడంతో.. వాటిపైనా దృష్టిపెట్టా రు. కొన్ని మిల్లుల్లో ధాన్యం దించుకునే సమయంలో కూడా తరుగు తీస్తుండడంతో పలుచోట్ల రైతులు కూ డా ఆందోళనలు చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబోసిన తర్వాత కొనుగోలు చేస్తున్నారు. మిల్లుల్లో తరుగు తీయకుండా కొంతమేర చర్యలు చేపట్టినా.. పలుమిల్లుల్లో మాత్రం తేమ, ఇతర కారణాలు చెప్పి తగ్గిస్తుండడం వల్ల రైతులకు క్వింటాకు 5కిలోల వరకు తరుగు పోతోంది. జిల్లాలో కొనుగోలు యాసంగిలో ఎక్కువగా చేయడంతో వానాకాలం కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఉండడంతో మిల్లుల్లో సరిపోక సొసైటీ ల గోదాములలో నిల్వకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిరికొండ, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాలతో పా టు ఇతర మండలాల్లోని సొసైటీల గోదాములలో నిల్వ చేస్తున్నారు. కొంత ధాన్యాన్ని నిజామాబాద్‌ మార్కె ట్‌ కమిటీలో నిల్వ చేస్తున్నారు. రైస్‌ మిల్లులో నిల్వలు తగ్గిన తర్వాత తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నా రు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్లతో పాటు చెల్లింపులు కూడా అదేస్థాయిలో చేస్తున్నారు.  

తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌: తేమ శాతం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. తేమశాతం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాం డ్‌ చేశారు. దీంతో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ రైతుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. వీలైనంత త్వరలోనే తేమ శాతం లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. 

Updated Date - 2022-05-24T06:59:15+05:30 IST