అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం

ABN , First Publish Date - 2022-08-20T06:14:50+05:30 IST

అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం

అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
మాట్లాడుతున్న సోము వీర్రాజు

బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు

నందిగామ, ఆగస్టు 19: ‘‘ అమరావతి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉంది. అక్కడ చేసిన ప్రతి అభివృద్ధి పని వెనుక మోదీ ఉన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని ముం దుకు తీసుకెళ్లడం లేదు. రాజధానిని ప్రధాని మోదీ పూర్తి చేసి తీరు తారు.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నంది గామ బీజేపీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించాక విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళతామని సోము స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ఎంపీ గోర్లంట వీడియోను సీబీఐకి ఇస్తుందని, నిజాలు నిగ్గు తేల తాయని అన్నారు.  బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పటికే జాతీయ  మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో హిందూ ఆల యాలకు చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆలయాల భూములపై హక్కులు లేకుండా చేయాలని కోరారు.  బండారు కేదార్‌నాథ్‌, మాదల రమేష్‌, తొర్లికొండ సీతారామయ్య, ముక్కపాటి నరసింహారావు, గంటా వెం కట్రావు పాల్గొన్నారు. 

పోలవరం పూర్తి చేయడమే కేంద్రం లక్ష్యం

ఇబ్రహీంపట్నం: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు నిధులు అం దిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. స్థానిక సిటీ ఫంక్షన్‌ హాల్లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21న విజయవాడలో జరిగే యువమోర్చా సం ఘర్షణ ముగింపు సభలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో ఐదు జన రల్‌ ఆసుపత్రులకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరామ్‌, డాక్టర్‌ దానం ఉమా మహేశ్వరరావు, రేగళ్ల రఘునాథరెడ్డి, నూతులపాటి బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-20T06:14:50+05:30 IST