Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 22 May 2022 00:41:47 IST

మనదంతా ఒకటే పరిశ్రమ

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌ హీరోయిన్లు దక్షిణాది చిత్రాలకు పెద్ద పీట వేయడం ఎప్పుడో మొదలైంది. ముఖ్యంగా పాన్‌ ఇండియా చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలను సాధించడంతో వారి దృషి ఇటువైపు మళ్లింది. దీపికా పడుకోన్‌ ప్రభాస్‌ సరసన కథానాయికగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కే’. అయితే కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దీపిక. గతంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌...ఇలా మనదేశంలో చిత్ర పరిశ్రమ విడిపోయి ఉంది. పాన్‌ ఇండియా సినిమాలతో అన్ని భాషలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు కలసి పని చేస్తున్నారు. మనదంతా ఒకటే పరిశ్రమ అని చాటి చెబుతున్నారు. తమ ప్రతిభతో పాన్‌ ఇండియా చిత్రాలతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవడం సంతోషకరం అని దీపిక అన్నారు.  ప్రస్తుతం ఆమె ‘సర్కస్‌’, ‘ఫైటర్‌’, ‘పఠాన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International