రాష్ట్రంలో మంచి మార్పు తెచ్చాం
రాజాం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంచి మార్పు తెచ్చామని.. 30 ఏళ్లూ అధికారంలో ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైసీసీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో 95 శాతం నెరవేర్చినందునే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లగలుగతున్నామని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో చరిత్రను తిరగరాద్దామని చెప్పారు. రాజాంలో గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అత్యధికంగా తీసుకురావాలని పిలుపిచ్చారు.