కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం: సుందర్ పిచాయ్

ABN , First Publish Date - 2021-01-21T23:09:50+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు

కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం: సుందర్ పిచాయ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా పారిస్ వాతావరణ మార్పు ఒప్పందంలో అమెరికాను చేర్చుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌‌పై సంతకం చేశారు. అంతేకాకుండా కొవిడ్-19 రిలీఫ్, ఇమ్మిగ్రేషన్‌ సంస్కరణలపై కూడా తక్షణమే చర్యలు తీసుకున్నారు. జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజునే ఈ చర్యలను తీసుకోవడంపై అనేక మంది ఆయనను ప్రశంసిస్తున్నారు. 


ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా జో బైడెన్‌పై ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు గూగుల్ మద్దతిస్తున్నట్టు ఆయన చెప్పారు. మహమ్మారి నుంచి అమెరికా కోలుకునేందుకు, ఆర్థిక రంగం అభివృద్ధికై కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. మరోపక్క ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ప్రభుత్వానికి సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. కాగా.. జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రపంచ దేశాధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Updated Date - 2021-01-21T23:09:50+05:30 IST