నిమ్మగడ్డ వచ్చినా ఏమీ చేయలేరు

ABN , First Publish Date - 2020-05-31T08:50:27+05:30 IST

‘హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు లు వచ్చినంత మాత్రాన మా ప్రభుత్వానికి ఢోకాలేదు. సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తాం’ అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గు డివాడ మార్కెట్‌ యార్డులో శనివారం రైతు

నిమ్మగడ్డ వచ్చినా ఏమీ చేయలేరు

  • హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీలు చేస్తాం: కొడాలి


గుడివాడ, ఒంగోలు కలెక్టరేట్‌, మే 30: ‘హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు లు వచ్చినంత మాత్రాన మా ప్రభుత్వానికి ఢోకాలేదు. సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తాం’ అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గు డివాడ మార్కెట్‌ యార్డులో శనివారం రైతు భరోసా కేంద్రం ప్రారంభం సందర్భంగా మాట్లాడారు. ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ను నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన పైవిధంగా స్పందించారు. ఎస్‌ఈసీగా ర మేశ్‌కుమార్‌ మళ్లీ వచ్చినా తమకు నష్టమేమీ లేదని, ఆయన ఏమీ చేయలేరని అన్నారు. రమేశ్‌కుమార్‌ టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారని ఆరోపించారు. చంద్రబాబుకు సిగ్గూ శరం ఉంటే టీడీపీని ఎన్టీఆర్‌ కుమారులకు వదిలేయాలని డిమాండ్‌ చేశారు. లోకేశ్‌తో సీబీఎన్‌ టీడీపీ అనిపార్టీపెట్టించి 2024 ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు.


కోర్టుల ద్వారా అభివృద్ధిని అడ్డుకొనే యత్నం: బాలినేని

‘రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకొనేందుకు ఏసీ రూముల్లో కూర్చుని కోర్టుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అంతిమ విజయం జగన్‌దే’ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో శనివారం మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతి చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2020-05-31T08:50:27+05:30 IST