సమాజసేవలో ‘మేముసైతం’

ABN , First Publish Date - 2021-05-07T03:03:11+05:30 IST

విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడమేకాకుండా కొవిడ్‌ కారణంగా హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కావాల్సిన వస్తువులను చేరచేస్తూ ఏబీవీపీ నాయకులు సమాజసేవలో మేముసైతం అంటున్నారు.

సమాజసేవలో ‘మేముసైతం’
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి సరుకులు అందజేస్తున్న ఏబీవీపీ నాయకులు

కొవిడ్‌ బాధితుల సేవలో ఏబీవీపీ

గూడూరురూరల్‌, మే 6: విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడమేకాకుండా కొవిడ్‌ కారణంగా హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కావాల్సిన వస్తువులను చేరచేస్తూ ఏబీవీపీ నాయకులు సమాజసేవలో మేముసైతం అంటున్నారు. కొవిడ్‌ కారణంగా కొంతమంది ఇంటిలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. వీరు బయటకి రాలేని పరిస్థితులుండడంతో మందులు, ఆహార పదార్ధాలు ఇతర సరుకులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన ఏబీవీపీ నాయకులు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి అవసరమైన వస్తువులను అందించేందుకు  కృషి చేస్తున్నారు.  సాయిసత్సంగ నిలయం, ఆశ్రయఫౌండేషన్‌, పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ వంటి సంస్థల ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు సేకరించి ఉచితంగా అందిస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 8297147437, 9398961396 ఫోన్‌ నంబర్లను సంప్రదిస్తే వారికి అవసరమైన వస్తువులను డోర్‌డెలివరీ చేస్తామని చెబుతున్నారు.  


Updated Date - 2021-05-07T03:03:11+05:30 IST