అహింస మార్గంలోనే తెలంగాణను సాధించుకున్నాం

ABN , First Publish Date - 2022-08-10T05:51:24+05:30 IST

అహింస మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ సన్నాహాక సమావేశానికి ఆయన హాజరై జాతీ య పతకాలను ఆవిష్కరించారు.

అహింస మార్గంలోనే తెలంగాణను సాధించుకున్నాం
జాతీయ జెండాలను ఆవిష్కరిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు

కామారెడ్డి, ఆగస్టు 9: అహింస మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ సన్నాహాక సమావేశానికి ఆయన హాజరై జాతీ య పతకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ అహింసమార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని గుర్తు చేశారు. మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారని తెలిపారు. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ భావాన్ని పెంపొందించేందుకు 15 రోజుల పాటు రాష్ట్రంలో వజ్రోత్సవాలు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్వతంత్య్ర ఉద్యమంలో త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని ప్రభుత్వం అం దజేస్తుందని పేర్కొన్నారు. రైతులకు 24గంటల పాటు నిరంతరం విద్యుత్‌ను ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి రైతులకు సాగునీరు అందిస్తున్నామని, గ్రామాల్లో వైకుంఠ ధామాలు, కంపోస్టుషెడ్డులు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పా టు చేసి పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సంక్షేమ గురుకుల పాఠశాలల ద్వా రా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని అన్నారు. గ్రామాల్లోని నిరుపేదలు ఆకలితో అలమటించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసరా పింఛన్లను అందజేసి వారి ఆకలిని తీరుస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం జరిగిన అభివృద్ధి విషయంలో సర్వే చేపట్టగా తెలంగాణలోని 10 గ్రామాలు అభివృ ద్ధి చెందిన జాబితాలో ఎంపికయ్యాయని తెలిపారు. ఈనెల 15న ప్రతీ ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేసి భారత దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటాలని తెలిపారు. జాతీయ పతకాలను అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీపీ బీబీపాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ శోభ, ఎమ్మెల్యేలు సురేందర్‌, హనుమంత్‌ షిండే, అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

కామారెడ్డి టౌన్‌: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రోడ్డు,భవనాల శాఖ మం త్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హరిజనవాడలో బస్తీ దవాఖానాను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో బస్తీ దవాఖానాలను తీసుకురావడం జరిగిందన్నారు. హైదరాబాద్‌ తర్వా త కామారెడ్డిలోనే బస్తీ దవాఖానాను ఎస్సీ వాడలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదలకు అందుబాటులో ఉండేందుకు అన్ని సౌకర్యాలను దవాఖానాలో సమకూర్చడం జరిగిందని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ కామారెడ్డిలో జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు రాజీవ్‌నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉండడంతో పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆలోచన చేసి బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ శోభ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:51:24+05:30 IST