Abn logo
Aug 5 2021 @ 18:06PM

వావ్... ఒక్క నెలలో... 127 % పెరిగిన స్పోర్టింగ్ ఇండియా ‘షేర్’

న్యూఢిల్లీ : వస్త్రవ్యాపార దిగ్గజం స్పోర్టింగ్ ఇండియా షేర్లు వరుసగా తొమ్మిదవ రోజు సైతం జోరును కొనసాగించాయి. గురువారం ఐదు శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ చేయబడ్డాయి. తాజాగా కంపెనీ బోనస్ ఇష్యూ ప్లాన్‌ను ప్రకటించిన తర్వాత గురువారం బీఎస్ఈలో దూసుకుపోయిన  కంపెనీ... రూ. 4,501.95 వద్ద కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది. 


ఇక గడిచిన ఆరు నెలల్లో... ఈ స్టాక్ బాహుబలిలా 465 శాతం పెరిగడం గమనార్హం. ఒక ఏడాదిలో 1,775 శాతం పెరిగి, బెంచ్‌మార్క్ సూచికలో వరుసగా 7.74 శాతం, 45.12 శాతం చొప్పున పెరిగింది. కాగా.. ఈ నెల(ఆగస్టు) 14 న జరగనున్న బోర్డు సమావేశంలో... బోనస్ ఈక్విటీ షేర్ల విషయాన్ని పరిశీలించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కంపెనీ కాటన్, కాటన్ పాలిస్టర్ బ్లెండెడ్, యాక్రిలిక్ బ్లెండెడ్ నూలును తయారుచేస్తోంది. ప్రత్యేకమైన, మల్టీ బ్రాండ్ స్టోర్‌ల ద్వారా స్పోర్టింగ్, మెంటర్ బ్రాండ్‌ల కింద స్పోర్ట్‌కింగ్ గ్రూప్ కంపెనీల ద్వారా వస్త్రాలను రిటైల్ చేస్తోంది.