జలమయమైన ఇచ్చోడ

ABN , First Publish Date - 2022-06-25T06:17:50+05:30 IST

మండల కేంద్రమైన ఇచ్చోడ శుక్రవారం కురిసిన వర్షానికి జలమయమైంది. ఎక్కడ చూసినా వర్ష నీళ్లతో రోడ్లన్నీ వాగుల్లా మారిపోయాయి. మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన ఇచ్చోడలో ప్రతియేటా వర్షాకాలంలో చిన్నపాటి వర్షాలకు రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా.. భవిష్యత్తు ప్రణాళికలతో మురికి కాలువలు నిర్మించక పోవడం, ఉన్న మురికి కాలువలు, రోడ్లు కబ్జాలకు

జలమయమైన ఇచ్చోడ
రోడ్లపై వాగులా ప్రవహిస్తున్న వర్షపు నీరు

ఇచ్చోడ రూరల్‌, జూన్‌ 24: మండల కేంద్రమైన ఇచ్చోడ శుక్రవారం కురిసిన వర్షానికి జలమయమైంది. ఎక్కడ చూసినా వర్ష నీళ్లతో రోడ్లన్నీ వాగుల్లా మారిపోయాయి. మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన ఇచ్చోడలో ప్రతియేటా వర్షాకాలంలో చిన్నపాటి వర్షాలకు రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా.. భవిష్యత్తు ప్రణాళికలతో మురికి కాలువలు నిర్మించక పోవడం, ఉన్న మురికి కాలువలు, రోడ్లు కబ్జాలకు గురికావడంతో ఇచ్చోడలో వర్షం పడితే ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే..!! వర్షాకాలంలో వరదలా వచ్చే నీళ్లను చూసి సంబంధిత అధికారులు నామమాత్రంగా వచ్చి చూసి తగు చర్యలు తీసుకుంటామన్న మాటలు నీటి మూటలే అవుతున్నాయి. ఒక మోస్తారుగా కురిసిన వర్షానికి విద్యానగర్‌, రుజాన్‌పూర్‌, టీచర్స్‌ కాలనీల్లోని పలు ఇళ్లలోకి నీళ్లు చొచ్చుకు వచ్చాయి. విద్యానగర్‌ కాలనీలో రోడ్లపై నాలుగు ఫీట్ల మేర వర్షపు నీళ్లు ప్రవహించాయి. జాతీయ రహదారి అయిన ఇచ్చోడ ప్రధాన రహదారిపై నీళ్లు ప్రవహించడం వల్ల ప్రజలు, వాహనదారులు పడిన బాధలు వర్ణాతీతం. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ విషయమై దృస్టి సారించాలని, ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని ఇచ్చోడవాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-25T06:17:50+05:30 IST