Abn logo
May 1 2021 @ 00:00AM

బొప్పాయ వాటర్‌మెలన్‌ స్మూతీ

పండ్ల రసాలతో పాటు స్మూతీలు కూడా వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. చక్కని రుచితో పాటు ఒంటిని చల్లబరిచే బొప్పాయ వాటర్‌మెలన్‌ స్మూతీ తయారీ చూద్దాం...


కావలసినవి: బొప్పాయ ముక్కలు- ఒకటిన్నర ముక్కలు, వాటర్‌మెలన్‌ ముక్కలు (గింజలతో ఉన్నవి) - ఒకటిన్నర కప్పు, నిమ్మరసం- ఒక టేబుల్‌ స్పూన్‌, తేనె- ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు- తగినంత, ఐస్‌క్యూబ్స్‌ కొన్ని.

 

తయారీ: బొప్పాయ, వాటర్‌మెలన్‌ ముక్కలు, నిమ్మరసాన్ని మిక్సీలో వేసి స్మూతీ తయారుచేసుకోవాలి. వాటర్‌మెలన్‌ గింజలు  పూర్తిగా గ్రైండ్‌ అయ్యేలా చూసుకోవాలి. తరువాత స్మూతీని గ్లాసుల్లో పోసి ఐస్‌ ముక్కలు వేసి సర్వ్‌ చేయాలి.