26 ఏళ్లుగా ఉచితంగా నీటిని అందిస్తున్న Water Man

ABN , First Publish Date - 2022-05-07T01:51:58+05:30 IST

అసలే ఎండాకాలం.. ఈ మండుటెండల్లో ప్రజలు అవసరం అయితే బయటికి రాని పరిస్థితి. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఎండనకా వాననకా గత 26 ఏళ్లుగా రోజూ ప్రజలకు ఉచితంగా చల్లటి మంచి నీటిని అందిస్తు

26 ఏళ్లుగా ఉచితంగా నీటిని అందిస్తున్న Water Man

ఇంటర్నెట్ డెస్క్: అసలే ఎండాకాలం.. ఈ మండుటెండల్లో ప్రజలు అవసరం అయితే బయటికి రాని పరిస్థితి. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఎండనకా.. వాననకా గత 26 ఏళ్లుగా రోజూ ప్రజలకు ఉచితంగా చల్లటి మంచి నీటిని అందిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన శంకర్​లాల్ సోనీ.. ఒక పేపర్ బాయ్‌. ప్రతిరోజూ తెల్లవారుజాము లేచి, ఇంటింటికీ తిరిగి పేపర్ వేస్తేనే అతడి కుటుంబానికి రోజు గడుస్తుంది. రోజులాగే ఒకసారి పేపర్‌ వేస్తున్నప్పుడు సోనీ దాహం వేసింది. మంచి నీళ్ల కోసం అడిగితే ఎవ్వరూ ఇవ్వలేదు. పైగా తమ నిద్ర పాడుచేశావని కొందరు విసుక్కున్నారు. దీంతో తనలా మరెవరూ నీటికోసం ఇబ్బంది పడకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. పేపర్‌ వేసే పని అయిపోగానే వాటర్‌ మ్యాన్‌గా అవతారం ఎత్తుతూ.. తన దగ్గర ఉన్న సైకిల్‌ మీదే తిరుగుతూ ఉచితంగా ప్రజలకు మంచి నీటిని అందజేస్తున్నారు. ఒక్కో సంచిలో 5 లీటర్లు చొప్పున.. మొత్తం 18 సంచుల్లో నీళ్లు నింపి సైకిల్​కు జాగ్రత్తగా తగిలించి.. వీధుల వెంట తిరుగుతూ.. అడిగిన వారందరి దాహం తీర్చుతారు. ఈ సంచుల్లోని నీళ్లన్నీ కొన్ని గంటల్లోనే అయిపోతాయి. ముండుంటెండను సైతం లెక్క చేయకుండా రోజులో మూడుసార్లు ఆ సంచుల్లో నీళ్లు నింపి.. నిత్యం వందల మందికి నీటిని అందిస్తున్నారు శంకర్‌లాల్. ఇలా దాదాపు 26 ఏళ్లుగా ఇలా నగర వీధుల్లో తిరుగుతూ దారినపోయేవారి దాహం తీర్చుతున్నారు. అందుకే ఆయనను అందరూ వాటర్​మ్యాన్​అని పిలుచుకుంటారు.


Read more