కాల్వ తెగడంతో జలమయమైన పంటపొలాలు, రహదారులు

ABN , First Publish Date - 2020-09-23T21:26:52+05:30 IST

తాండ్ర అల్లంతోట, బావితండా, తిమ్మరాసిపల్లి మధ్య కేఎల్ఐడీ 82 కాలువ రెండు చోట్ల తెగిపోవడం వల్ల..

కాల్వ తెగడంతో జలమయమైన పంటపొలాలు, రహదారులు

నాగర్ కర్నూల్ జిల్లా: తాండ్ర అల్లంతోట, బావితండా, తిమ్మరాసిపల్లి మధ్య కేఎల్ఐడీ 82 కాలువ రెండు చోట్ల తెగిపోవడం వల్ల గ్రామాల్లోకి వెళ్లే రహదారులు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడడంతో స్థానికులు కాల్వ కట్ట పైనుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలకు వరద నీరు చేరుకుని కాల్వ తెగిపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ తెగి మూడు రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కాలువ నిర్మాణంలో నాణ్యత లోపమే దీనికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.

Updated Date - 2020-09-23T21:26:52+05:30 IST